సుమకి క్షమాపణ దొరికేనా?!
అత్తవారింట దీపం పెట్టడానికి వెళ్లింది. కొద్దిరోజుల్లో ఆ ఇంటికే దీపమయ్యింది. సమస్యలన్నీ తీర్చింది. కానీ అనుకోని పరిస్థితుల్లో తానే సమస్యల్లో చిక్కుకుంది. భర్త గుండెల్లో సింహాసనం వేసుకుని కూర్చునే ఆమె, అతడి ఆగ్రహానికే గురై, చివరికి ఏకంగా అతడికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది.
మరి దూరమైపోతుందా? లేక క్షమాపణ పొంది మళ్లీ అతడి మనసులో చోటు సంపాదిస్తుందా? ‘మూడు ముళ్లు’ సీరియల్ చూస్తోన్న ప్రేక్షకులందరికీ ఇప్పుడిదే టెన్షన్. అయితే ఆ టెన్షన్ ఇప్పుడే తీరే చాన్స్ లేదు. ఎందుకంటే హీరోయిన్ సుమ మరిన్ని సమస్యల్లో కూరుకుపోనుంది. భర్తకు పూర్తిగా దూరమైపోనుంది. అతడిని మరో అమ్మాయికి వదిలేసి, వేరే దేశమే వెళ్లిపోనుంది. మరి మళ్లీ ఆమె భర్తను కలుస్తుందా? అతడి మనసులో, జీవితంలో తిరిగి ప్రవేశిస్తుందా? అప్పుడే చెప్పేస్తే ఎలా! కాస్త వేచి చూడండి.