మునగాల ముమ్మాటికీ మాదే: జూలూరు
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని భద్రచలం మండలాన్ని తూర్పుగోదావరిలో, మునగాల మండలాన్ని కృష్ణా జిల్లాలో కలపాలన్న వాదనలను ముందుకు తేవడం నీటిదొంగల కుట్రలో భాగమేనని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ఆరోపించారు. అర్థంలేదని వాదనలు ముందుకు తేవడం సంస్కారహీనమని విమర్శించారు.
కృష్ణా జిల్లాలోని పరిటాల, బందరు ప్రాంతాలు తెలంగాణవేనని తాము కూడా వాదన తేవచ్చని తెలిపారు. బందరు వస్తే తెలంగాణకు సముద్రం వస్తుందని అయితే ఆ వాదనలు అర్థరహితమైనవని నేడొక ప్రకటనలో వ్యాఖ్యానించారు. నీళ్లు కావాలంటే అబద్దాలతో పనిలేదని, కేంద్ర జలసంఘం అన్నిప్రాంతాలకు నీటి పంపకాలు చేస్తుందని పేర్కొన్నారు. మునగాల తెలంగాణ ముఖద్వారమని, మట్టివారసత్వం ఉన్న పోరుగడ్డ అని కితాబిచ్చారు.
రెచ్చగొట్టద్దు: మురళీధర్‌రావు
విభజన రేఖలు గీస్తున్న సమయంలో సరిహద్దుల కొట్లాటలతో ఇరుప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టవద్దని టీఆర్ఎల్డీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బి.మురళీధరరావు సూచించారు. హైదరాబాద్ సహా పదిజిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని కోరారు. నగరాన్ని ఉమ్మడి రాజధాని చేయాలనడం అక్రమాస్తులు కాపాడుకునేందుకని మండిపడ్డారు. 60 ఏళ్ల పైచీలుకు తెలంగాణ పోరాటాన్ని అపహాస్యం చేసేలా కేంద్రం నిర ్ణయాలు తీసుకోవద్దని విజ ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీళ్లకోసం చరిత్రను తలకిందులు చేసి అభాసుపాలుకావద్దని కోరారు.