నాగాలాండ్ సీఎం నైపూ రియో రాజీనామా
కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రి నైపూ రియో తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అశ్వనీ కుమార్ ఆయన రాజీనామాను ఆమోదించారు. నైపూ రియో లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఆయన సీఎం పదవిని వదులుకున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేతృత్వంలోని డెమొక్రాటిక్ అలయన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) శాసన సభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా జెలియాంగ్ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జెలియాంగ్ ప్రస్తుతం గనులు, భూగర్భ వనరులు, ప్రణాళిక శాఖల మంత్రిగా ఉన్నారు. జెలియాంగ్ అభ్యర్థిత్వానికి డీఏఎన్లోని పక్షాలైన జేడీయూ, ఎన్సీపీ, బీజేపీ, స్వత్రంతులు పూర్తి మద్దతు ప్రకటించారు.