పేదలను ఆదుకునేందుకే సీఎం సహాయనిధి
కరీంనగర్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపా రు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మం జూరైన రూ.16లక్షల చెక్కులను 46మందికి అందజేశారు.
జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీ వినోద్‌కుమార్, రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.