నెల్లూరులో మెడికో ఆత్మహత్య
నెల్లూరు: నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థిని నాగ శ్రావణి ఆదివారం తెల్లవారుజామున హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో విద్యార్థిని మృతిపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నాగ శ్రావణి ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతుందని పోలీసులు తెలిపారు. యాజమాన్యం ఒత్తిడి కారణంగానే నాగ శ్రావణి ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో కాలేజి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.