తిక‘మకి’ డిజైన్లు..!
♦ దేశీయ ఆర్కిటెక్ట్‌లకు అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల బాధ్యత
♦ జపాన్ మకి అసోసియేట్స్ వైఫల్యంతో రూటుమార్చిన సర్కారు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయానికి జపాన్ డిజైన్‌ను ఎంపికచేసి అభాసుపాలైన సర్కారు.. తాజాగా రూటు మార్చింది. విదేశీ సంస్థల జోలికిపోకుండా దేశీయ ఆర్కిటెక్ట్ సంస్థలకే ఐకానిక్ భవనాల డిజైన్ల రూపకల్పన బాధ్యతను అప్పగించింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించిన డిజైన్లను మూడువారాల్లో సమర్పించాలని దేశంలోని 7 ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థలను కోరింది.
మకి అసోసియేట్స్ నమూనాను పూర్తిగా మార్చాలని, లేని పక్షంలో దానికి మరింత మెరుగులు దిద్దాలని సూచించింది. ఇక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా చేయడంతోపాటు ఆధునికత ఉట్టిపడేలా డిజైన్లు తయారు చేయాలని కోరింది.ఈ నేపథ్యంలో సోమవారం గేట్‌వే హోటల్లో మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ శ్రీకాంత్, సీసీడీఎంసీ ఎండీ లక్ష్మీపార్థసారథి ఇతర ఉన్నతాధికారులు దేశంలోని ఏడు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
త్వరలో వైద్యుల రిటైర్మెంట్ వయస్సు పెంపు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని
సాక్షి, విశాఖపట్నం: రాష్ర్టంలోని ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విశాఖలో ఉత్తరాంధ్ర ప్రభుత్వాస్పత్రి వైద్యులు, అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.