జాతీయ పోటీలకు తేలప్రోలు విద్యార్థులు
తేలప్రోలు (ఉంగుటూరు):
జాతీయస్థాయి పోటీలకు తేలప్రోలు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు టి.ప్రసాదు శుక్రవారం తెలిపారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు జెడ్పీలో సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలలో కృష్ణాజిల్లా జట్టు తృతీయ స్థానం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు రాంబాబు వివరించారు. తేలప్రోలు విద్యార్థులు కె.అనూష, జి.నవీన్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. సెప్టెబంరు 12 నుంచి 16 వరకు కేరళలోని తిరువనంతపురంలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులను సర్పంచ్ భీమవరపు హరిణికుమారి, ఎస్ఎంసీ చైర్మన్ వింత రమేష్‌రెడ్డి, టి.శ్రీలత తదితరులు అభినందనలు తెలిపారు.