National Family Health Survey-2015-16
-
పెళ్లికాని యువతులు.. పెరిగిన కండోమ్‌ల వాడకం
న్యూఢిల్లీ : గర్భనిరోధక పద్ధతులపై పెళ్లికాని యువతులు ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నారని, వారిలో కండోమ్ వాడకం పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) లో వెల్లడైంది. గడిచిన దశాబ్ధకాలంలో పెళ్లికాని (15 నుంచి 45 ఏళ్ల వయసున్న)మహిళల్లో కండోమ్‌ల వాడకం 2 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. ప్రధానంగా 20-24 ఏళ్ల వయసున్న యువతులే అత్యధికంగా రక్షణాత్మక పద్ధతులను పాటిస్తున్నట్లు తేలింది. మొత్తంగా భారత్‌లో గర్భనిరోధక రేటు 54 శాతంగా ఉందని జాతీయ సర్వే తెలిపింది. పెళ్లైన మహిళల్లో అత్యధికులు ఇప్పటికీ పాత పద్ధతులనే పాటిస్తున్నారని, కేవలం ఒక్క శాతం మహిళలు మాత్రమే కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి అధునిక గర్భనిరోధక పద్ధతులను పాటిస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్), భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)ను నిర్వహించారు. 1992 నుంచి 2016 వరకు నాలుగు సార్లు సర్వేను చేపట్టారు. కుటుంబ ఆరోగ్య సర్వే ముఖ్యాంశాలు కొన్ని.. ⇒99శాతం మంది పెళ్లైన మహిళలు ఏదో ఒక పద్ధతిలో ఫ్యామిలీ ప్లానింగ్‌ను పాటిస్తున్నారు. ⇒కేవలం 1 శాతం మంది మాత్రమే పిల్స్‌ను వినియోగిస్తున్నారు. ⇒పెళ్లికాని మహిళల్లో 34 శాతం మంది గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నారు. ⇒ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ముగ్గురు.. గర్భనిరోధం అనేది మహిళలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తున్నారు. ⇒గర్భనిరోధక పద్ధతులు పాటించడంలో పంజాబ్ మహిళలదే పైచేయి. ఆ రాష్ట్రంలో 76 శాతం మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు. ⇒మణిపూర్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో అత్యల్పస్థాయిలో 24 శాతం మంది మహిళలు మాత్రమే గర్భనిరోధక పద్ధతులను అనుసరిస్తున్నారు. ⇒కండోమ్‌ను సరిగ్గా వాడితే గర్భ నిరోధం సాధ్యమవుతుందని 61 శాతం మంది పురుషులు నమ్ముతున్నారు. ⇒సిక్కు, బౌద్ధ మహిళల్లో గర్భనిరోధక సాధనాలు వాడేవారి శాతం 65గా ఉంటే, ముస్లిం మహిళల్లో అది 38 శాతం మాత్రమే ఉందని సర్వేలో తేలింది. ⇒అల్పాదాయ వర్గాల్లో 36 శాతం, అధికాదాయ వర్గాల్లో 53 శాతం మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు. ⇒59 శాతం మంది మహిళలు టీవీల్లో వచ్చే ప్రకటనల ద్వారా గర్భనిరోధానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. -
భారత్‌లో అత్యంత సంపన్నులు ఏ మతస్తులో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలో ముస్లింల జనాభా పెరిగిపోతున్నద’ని హిందూ అతివాదులు.. ‘మీకు పిల్నల్ని కనడం చేతకావట్లేద’ని ముస్లిం అతివాదులు పరస్పరం విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం చూస్తున్నాం. కానీ వాస్తవం ఏంటంటే.. రెండు వర్గాల మహిళల్లోనూ గర్భధారణ(ఫర్టిలిటీ) రేటు గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా విడుదలైన కేంద్ర ఆరోగ్య జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)లో ఇలాంటివే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సంతానోత్పత్తి ఇలా.. : గడిచిన పదేళ్లలో హిందూ కుటుంబాల్లో ఫర్టిలిటీ రేటు 2.8 నుంచి 2.1కి పడిపోయింది. అదే ముస్లిం మహిళల్లో 3.4 నుంచి 2.6కు తగ్గింది. అయితే హిందూ-ముస్లిం వర్గాలతో పోల్చుకుంటే జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ వర్గాల్లో పిల్లల్నే కనే ప్రక్రియ దారుణంగా మందగించింది. జైనులు కేవలం 1.2 ఫర్టిలిటీ రేటుతో అట్టడుగున నిలిచారు. అదే సిక్కుల్లో 1.6, బౌద్ధుల్లో 1.7, క్రైస్తవుల్లో 2గా నమోదయింది. అల్పాదాయం పొందే పేద వర్గాల్లో సంతానోత్పత్తి రేటు 3.2కాగా, అధిక పొందే(హై ఇన్కమ్ లెవెల్) వర్గాల్లో ఈ రేటు 1.5 మాత్రమే ఉంది. ఇక ఎస్టీల్లో 2.5, ఎస్సీల్లో 2.3, బీసీల్లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు.. అగ్రకులాల్లో(అప్పర్ క్యాస్ట్స్‌లో) మాత్రం 1.9గా ఉంది. జైనులే అత్యంత సంపన్నులు ⇒జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం దేశంలో అత్యంత సంపన్న వర్గం జైనులదే. ⇒జైనుల్లో 70.6శాతం మంది అత్యధిక ఆదాయాన్ని పొందుతూ సంపన్నులుగా ఉన్నారు. ⇒జైనుల్లో 7.9శాతం మంది మాత్రమే ఆల్పాదాయవర్గంలో ఉన్నారు. ⇒జైనుల తర్వాత సంపన్నవర్గంగా సిక్కులు ఉన్నారు. ⇒సిక్కుల్లో 59.6 శాతం మంది సంపన్నులేకాగా, అల్పాదాయాన్ని పొందేవారు 5.2 మంది మాత్రమే ఉన్నారు. ⇒ఇక దేశంలో మెజారిటీ వర్గమైన హిందువుల్లో 40.2 మంది అల్పాదాయ పరిధిలో ఉన్నారు. ⇒హిందువుల్లో సంపన్నుల శాతం19.3కాగా, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలో 39.6 శాతం మంది ఉన్నారు. ⇒ముస్లింలలో 39.5 శాతం మంది చాలా తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ⇒ముస్లింలలో సంపన్నుల శాతం 18.2గా, మధ్యతరగతి, ఎగువ తరగతి వారి శాతం 42.3గా ఉంది. ⇒క్రైస్తవుల్లో 29.1 శాతం మంది సంపన్నులు, 26.6 శాతం మంది పేదలు ఉన్నారు. ⇒బౌద్ధుల్లో 20.4 శాతం మంది సంపన్నులుగానూ, 49.6శాతం మంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గంగానూ, 30.2 శాతం మంది అల్పదాయ వర్గంగానూ కొనసాగుతున్నారు. సంపన్న రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్ ఎన్‌ఎఫ్‌హెచ్ సర్వే ప్రకారం దేశం మొత్తంలో ఢిల్లీ, పంజాబ్‌లు సంపన్న రాష్ట్రాలుగా నిలిచాయి. అందుబాటులో స్వచ్ఛమైన తాగునీరు, సౌకర్యవంతమైన ఇళ్లు, టెలివిజన్ వంటి గృహోపకరణాలు, రవాణా.. తదితర సౌకర్యాల ప్రాతిపదికన సంపన్న రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ- పంజాబ్‌లు తొలి స్థానాన్ని దక్కించుకున్నాయి. పేద రాష్ట్రంగా బిహార్ చివరి స్థానంలో ఉంది. సర్వే చేసింది ఎవరు? : అమెరికా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్) ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ సహకారంతో 1992 నుంచి ‘కేంద్ర ఆరోగ్య జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)’ను నిర్వహిస్తున్నారు. ఇటీవల వెల్లడించిన (2015-16) సర్వే.. ఎన్ఎఫ్హెచ్ఎస్ చేపట్టినవాటిలో నాలుగోది. 1992-93లో మొదటిసారి, 1998-99లో రెండో, 2005-6లో మూడో, 2015-16లో నాలుగో సర్వేను నిర్వహించారు. -
మన చిన్నారులు హెల్దీయే
షరతులు వర్తిస్తాయి..! దశాబ్దం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో చిన్నారులు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారట. కానీ ఈ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం ఇప్పటికీ మనదేశం వెనుకబడే ఉందట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–2015–16 పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 2005–06 తర్వాత నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదికను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం.. దేశంలో శిశు మరణాల రేటు గత దశాబ్ద కాలంలో 16 పాయింట్లు తగ్గింది. దశాబ్దం క్రితం ప్రతి వెయ్యి జననాల్లో ఏడాదిలోపు శిశు మరణాల సంఖ్య 57గా నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 41కి తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గింది. 2005–06 మధ్య కాలంలో ప్రతి వెయ్యి జననాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు 74 మంది మరణించగా.. ప్రస్తుతం అది 24 పాయింట్లు తగ్గి 50కి దిగివచ్చింది. ఇంకా అనేక అంశాల్లో మనదేశ చిన్నారులు గతంతో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అయితే శిశు మరణాల రేటు విషయంలో పొరుగునే ఉన్న పేద దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌తో పోలిస్తే మనం ఇంకా చాలా వెనుకబడే ఉన్నామని పేర్కొంది. మనదేశంలో ఏడాదిలోపు శిశు మరణాల రేటు 41 కాగా.. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌లో 31, నేపాల్‌లో 29, ఆఫ్రికా దేశాలైన రువాండా 31, బోత్సవానా 35 పాయింట్లతో మనకంటే మెరుగ్గా ఉన్నాయి. పాకిస్తాన్(66) మాత్రం మనకంటే వెనుక ఉంది. ఇక ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు మన దేశంలో 50 అయితే నేపాల్(36), బంగ్లాదేశ్(38), భూటాన్(33) మనకంటే చాలా ముందున్నాయి. కాగా, 23 ఏళ్ల క్రితంతో పోలిస్తే దేశంలో శిశు మరణాల రేటు 48 శాతం తగ్గింది. 1992–93లో శిశు మరణాల రేటు 79 కాగా, 2015–16 నాటికి అది 41కి తగ్గింది. అయితే ఐక్య రాజ్యసమితి 2015లో శిశు మరణాల రేటుపై నిర్ధేశించిన మిలీనియం డెవలప్మెంట్ గోల్ 27 పాయింట్ల కంటే ఇది చాలా దూరంలో ఉండటం గమనార్హం. రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు శిశు మరణాల రేటులో రాష్ట్రాల మధ్య కూడా తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్టు తేలింది. ఛత్తీస్‌గఢ్(54)లో అత్యధికంగా ఏడాదిలోపు శిశు మరణాల రేటు నమోదు కాగా.. మధ్యప్రదేశ్(65) ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటుతో ముందుంది. ఇదే సమయంలో ఏడాదిలోపు, ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు కేరళలో తక్కువగా నమోదయ్యింది. మిజోరాంలో మాత్రం 2005–06లో ఏడాదిలోపు చిన్నారుల్లో వెయ్యి జననాలకు 34 మరణాలు నమోదు కాగా.. 2015–16 నాటికి అది 40గా రికార్డయ్యింది.