కిలిమంజారోపై ‘సప్తపది’
► కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ విద్యార్థులు
► శిఖరాగ్రంపై 100 అడుగుల జాతీయ పతాకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆఫ్రికాలోకెల్లా అత్యం త ఎత్తయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని సోమవారం అధిరోహించారు. వీరిలో పలు వురు గిరిజన, బీసీ ఆశ్రమ పాఠశాలల విద్యా ర్థులుండటం విశేషం. శిఖరాగ్రాన 100 అడు గుల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర దిన సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, గిరిజన వీరు డు కుమ్రం భీంల చిత్రపటాలను ప్రదర్శిం చారు.
ఈ బృందంలో వనపర్తి సాంఘిక సంక్షేమ పాఠశాలలో పదో తరగతి చదువు తున్న సబావత్ సునీత కూడా ఉండటం విశేషం! ఆమెతో పాటు నాయిని మల్లేశ్ (ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల), ఆనంద్‌కుమార్, శ్రీకుమార్, అరుణ్ కుమార్ (నల్లగొండ), చరణ్‌రాజ్ (నాగర్‌కర్నూలు వాసి, కింగ్‌కోఠీ బీసీ సంక్షేమ హాస్టల్ డిగ్రీ విద్యార్థి), రాఘవేంద్ర (మహబూబ్‌నగర్) బృందంలో ఉన్నారు. ఏపీ నుంచి సత్యారావు (డిగ్రీ విద్యార్థి, బంగారుపాళెం, విశాఖపట్నం), రఘునీథ్ (మౌంటెనీరింగ్ గైడ్, తాడేపల్లి, గుంటూరు) ఈ బృందంలో ఉన్నారు.
తమిళనాడు నుంచి నలుగురు, పశ్చిమ బంగ, మహారాష్ట్రల నుంచి ఒక్కొ క్కరు కూడా బృందంలో ఉన్నారు. మొత్తం 15 మందితో కూడిన భారత బృందం ఈ నెల 10న పర్వతారోహణకు శ్రీకారం చుట్టింది. పర్వతారోహకుడు శేఖర్‌బాబు నేతృత్వంలో సోమవారం సాయంత్రానికల్లా 5,895 మీటర్లు ఎక్కి శిఖరాగ్రాన్ని చేరి విజయపతాక ఎగురవేసింది. ఆనంద్‌కుమార్ 2014లో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. పర్వతారోహ ణను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థు లను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అభినందించారు. సీఎం కేసీఆర్ చొరవే ఈ విజయానికి కారణ మన్నారు. గిరిజన విద్యార్ధులకు అత్యుత్తమ విద్య, అవకాశాలను కల్పిస్తున్న సీఎంకు, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.