30న హైదరాబాద్‌లో ‘జాతీయ రెడ్డి గర్జన’
జాతీయ రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రెడ్ల అభివృద్ధి, ఐక్యతే ధ్యేయంగా ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ‘జాతీయ రెడ్డి మహాగర్జన’ నిర్వహించనున్నట్టు ఆ వేదిక జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గుంటూరులోని ట్రావెల్స్ బంగ్లాలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుం చి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది మంత్రులను, 16 మంది పార్లమెంటు సభ్యు లు, 108 మంది శాసనసభ్యులకు, అలాగే 46 మంది ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేషన్ చైర్మన్లను, జెడ్పీ చైర్మన్లను ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
రెడ్లలో అత్యధిక శాతం మంది కడు పేదరికంతో దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని వీరిని ఆదుకునేందుకు ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గత 65 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు లేక రెడ్లు ఉద్యోగ అవకాశాలకు దూరమ య్యారని 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కరుణా కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెడ్డి మహాగర్జన సందర్భంగా పేద విద్యార్థుల సంక్షేమానికి, ఉన్నత విద్య కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాగా సినిమాల్లో రెడ్లను అసభ్యకరంగా, దుర్మార్గులుగా, ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని, ఇలాంటి చర్యలను నియంత్రించాలని ఆయన కోరారు.
సభ నిర్వహణకు చంద్రబాబు అడ్డుపుల్లలు: జాతీయ రెడ్డి మహాగర్జనను తొలుత అమరావతిలోని గుంటూరులో నిర్వహించాలని నిర్ణయించామని కరుణాకరరెడ్డి తెలిపారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీకి చెందిన నేతల ద్వారా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.