National rifle shooting
-
జాతీయ రైఫిల్ షూటింగ్ పోటీలకు రోహిత్
కదిరి అర్బన్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నవంబర్ 26, 27, 28 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు కదిరి మున్సిపల్ పరిధిలోని బ్లూమూన్ కళాశాల విద్యార్థి రోహిత్ ఎంపికయ్యాడు. వైఎస్సార్‌జిల్లా ప్రొద్దుటూర్‌లో ఈ నెల 14,15,16వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పీప్సైట్ విభాగంలో కొత్తపల్లి చెందిన రోహిత్ తన ప్రతిభను చాటి రజతపథకం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. రోహిత్ బ్లూమూన్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. 2012–13లో 7వ తరగతి చదివే సమయంలో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న గన్ఫర్ గ్లోరి రైఫిల్ షూటింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అదే ఏడాది గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రోహిత్ బంగారు పతకం సాధించాడు. అనంతరం 2013–14, 2014–15,2015–16లో వరుసగా బంగారు, వెండి, రజత పతకాలు సాధించి అతి చిన్న వయసులో నాలుగుసార్లు 2016–17 రజతం సాధించి వరుసగా ఐదుసార్లు జాతీయజట్టుకుఎంపిక కావడం విశేషం. జాతీయస్థాయిలో ఈ సారి మెడల్ సాధించడమే లక్ష్యంమని రోహిత్ తెలిపాడు. గన్ ఫర్ గ్లోరీ రైఫిల్ షూటింగ్ అకాడమీ హైదరాబాదులో కోచ్ సుశీల్‌కుమార్ పర్యవేక్షణలో రోహిత్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
జాతీయ స్థాయి రైఫిల్ పోటీలకు హాసిని
రామచంద్రపురం : పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సత్తి కృష్ణ చైతన్యరెడ్డి కుమార్తె కృష్ణ హాసిని స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్ 14 జాతీయ స్థాయి రైఫిల్ పోటీలకు ఎంపికయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం జరిగిన 62వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలలో ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల షూటింగ్ విభాగంలో హాసిని ఉత్తమమైన ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా ఏజీఎఫ్ రైఫిల్ అసోసియేష¯ŒS కార్యదర్శి సమీర్ విలేకరులకు తెలిపారు. -
జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్‌కు జశ్వంత్ తేజ
ఢిల్లీ వెళతాననుకోలేదు: పేద కుటుంబంలో పుట్టిన నేను నాజీవితంలో కనీసం ఢిల్లీ చూడడానికైనా వెళ్తానని అనుకోలేదు. ఎన్సీసీపై నాకున్న ఆసక్తే ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్లో పాల్గొనే అవకాశాన్నిచ్చింది. - జశ్వంత్‌తేజ కాజులూరు, న్యూస్‌లైన్ : గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న వినకోటి జశ్వంత్ తేజ ఎన్సీసీలో తన ప్రతిభ చాటుతూ దూసుకుపోతున్నాడు. ఇటీవల జరిగిన పలు జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాంపుల్లో అవార్డులు సాధించడమే కాకుండా ఈ నెల 27 నుంచి అక్టోబర్ ఎనిమిదో తేదీ వరకూ ఢిల్లీలో జరుగనున్న జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్‌కు ఎంపికయ్యాడు. జశ్వంత్ తేజ తల్లి రామకృష్ణవేణి గొల్లపాలెం పీహెచ్సీలో ఏఎంఎన్గా, తండ్రి సత్యనారాయణ మంజేరులో వీఆర్ఏగా పనిచేస్తున్నారు. జశ్వంత్ తేజ ఎనిమిదో తరగతిలో ఎన్సీసీలో చేరాడు. గత వారం నిజామాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో జరిగిన రైఫిల్ షూటింగ్లో మెదటి స్థానం సాధించి జశ్వంత్ తేజ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు ఎన్సీసీ ఆఫీసర్ వి. మాచరరావు తెలిపారు. ఈ పోటీలకు మన రాష్ట్రం నుంచి ఆరుగురు ఎంపికయ్యారని, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల స్థాయిలోని 18వ ఆంధ్రా బెటాలియన్ నుంచి జశ్వంత్‌తేజ ఒక్కడే ఎంపిక కావటం గర్వించదగ్గ విషయమని స్కూల్ హెచ్ఎం వీఎస్ సుజాత అన్నారు. గ్రామ సర్పంచ్ వడ్డి సత్యవతివెంకటరమణ, అలైన్స్క్లబ్ అధ్యక్షుడు శేఠ్ రాజ్‌పటేల్, జోన్ చైర్మన్ టి. వాసురెడ్డి తదితరులు జశ్వంత్‌కు అభినందనలు తెలియజేశారు.