Nazi camps
-
బాప్రే!.. ఏకంగా 11 వేలకు పైగా హత్యలు చేసిన 97 ఏళ్ల వృద్ధురాలు
ఒకటి రెండు కాదు ఏకంగా వేలమందిని హత్య చేసింది ఒక వృద్ధురాలు. రెండో ప్రప్రంచ యుద్ధం సమయం నాటి కేసులో కోర్టు తాజాగా ఆమెను దోషిగా తేల్చి శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే.. 97 ఏళ్ల వృద్ధురాలు ప్రస్తుత పోలాండ్‌కి సమీపంలో ఉన్న స్టట్‌థాప్ నాజీ నిర్బంధ శిబిరంలో కార్యదర్శిగా పనిచేసింది. ఆ సమయంలో ఆమె అక్కడ నిర్బంధంలో ఉన్న యుద్ధ ఖైదీలు సుమారు 10,500 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఐతే ఆ హత్యల్లో ఈ వృద్ధురాలు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిందితులకు సహకరించినట్లు జర్మనీలో ఇట్జెహులో జిల్లా కోర్డు మంగళవారం పేర్కోంది. ఆ కేసులో ఆమెకు రెండేళ్ల బహిష్కరణ శిక్ష తోపాటు ఆమె ఈ హత్యలు చేసినప్పుడూ వయసు 18 నుంచి 19 సంవత్సరాల మద్య ఉండటంతో అప్పటి బాల నేరస్తుల చట్టం ప్రకారం విధించే శిక్షలను కూడా విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఆమెపై దాదాపు 11,412 మంది హత్యలకు సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఐతే 2021 నుంచి కోర్టులో ట్రయల్స్ ప్రారంభం కావడం ఆలస్యమైంది. అదీగాక ఆమె కూడా అనారోగ్యంతో ఉండటంతో కోర్టుకు అందుబాటులో లేకుండా పోయింది. ఆ వృద్ధురాలు 1943 నుంచి 1945 కాలంలో స్టట్‌థాప్ నాజీ నిర్బంధ శిబిరంలో పనిచేసింది. అక్కడ నిర్బంధంలో ఉన్న దాదాపు 65 వేల మంది ఆకలితో లేదా వ్యాధులతో మరణించారు. మరికొంతమంది స్టట్‌థాప్‌లోని గ్యాస్ చాంబర్లో మరణించారు. వారంతా నాజీల నిర్మూలన ప్రచారంలో పాల్గొన్న యుద్ధ ఖైదీలు, వారిలో కొందరూ యూదులు కూడా ఉన్నట్లు సమాచారం. ఐతే ఇది రెండో ప్రపంచ యుద్ధ నేరాలకు సంబంధించిన చివరి కేసు విచారణ అని జర్మనీ స్థానికి మీడియా పేర్కొనడం గమనార్హం. (చదవండి: రష్యా బలగాలకు ఆకస్మిక ఆదేశాలు.. భయాందోళనలో ఉక్రెయిన్) -
3,518 మంది హత్య.. 75 ఏళ్ల తర్వాత విచారణ
-
5,232 మంది హత్యకు సాయం.. రెండేళ్ల శిక్ష
బెర్లిన్: నరకానికి నకళ్ల లాంటి నాజీ క్యాంప్ పేరు చెబితే ఇప్పటికి జర్మన్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. యూదుల మీద కోపంతో నియంత అడాల్ఫ్ హిట్లర్ వారిని ఊచకోత కోయడం కోసం ఏర్పాటు చేసిన ఈ క్యాంపుల్లో ఎందరో బలయ్యారు. అయితే నాటి కాలానికి సంబంధించిన నేరాల గురించి నేటికి జర్మనీలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో చివరి కేసులో జర్మన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో సుమారు 5,232 మంది ఖైదీలను, అనేక మంది యూదులను హత్య చేయడానికి సాయం చేసిన 93 ఏళ్ల బ్రూనో డి అనే వ్యక్తిని హాంబర్గ్ కోర్టు దోషిగా తేల్చింది. నాటి నేరాలకు గాను అతడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం పోలాండ్లోని గ్డాన్స్క్కు సమీపంలోని స్టుతోఫ్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఎస్ఎస్ బ్రూనో డి గార్డుగా పని చేసేవాడు. ఈ క్రమంలో 1944 ఏప్రిల్ 1945 మధ్య జరిగిన ఈ హత్యలకు బ్రూనో డి సహకరించినట్లు హాంబర్గ్ కోర్టు గురువారం తెలిపింది. ఈ నేరం జరిగినప్పుడు బ్రూనో డి వయసు కేవలం 17, 18 సంవత్సరాలు కావడంతో అతడికి యువత శిక్షా మార్గదర్శకాలకు లోబడి శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది. ఈ క్రమంలో బ్రూనో డి ఆ సమయంలో తాను అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు అంగీకరించాడు. అయితే హత్యలకు సహకరించాల్సి వచ్చిందని.. దానిలో తన తప్పమే లేదని తెలిపాడు. అంతేకాక నాటి నరకంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు క్షమాపణ తెలిపాడు. స్టుతోఫ్లో దాదాపు 65 వేల మందిని హత్య చేశారని మ్యూజియం వెబ్సైట్ వెల్లడిస్తుంది. వీరిలో యూదులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు వెబ్సైట్లో ఉంది. వీరిలో కొందరిని తల వెనక భాగంలో కాల్చి చంపగా.. మరి కొందరి మీద ప్రాణాంతకమైన జైక్లాన్ బీ వాయువు ప్రయోగించి చంపినట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. -
ఒక ఎడారి పువ్వు!
గ్రేట్ లవ్ స్టోరీస్ నాజీ క్యాంపులు ఎలా ఉంటాయి? ఎవరో నరాలను గట్టిగా మెలిపెడు తున్నట్లుగా ఉంటాయి. చావుకు బతుకుకు మధ్య శ్వాస ఆడక...‘బతికి చావడం కంటే, చచ్చి బతకడం నయం’ అనిపించేలా ఉంటాయి. హిట్లర్ నాజీ క్యాంపులలో జీవితమే ఉండదు. అలాంటిది ‘ప్రేమ’ ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది. ప్రేమని బందూకులు భయపెట్టలేవు. ఇంకే రకమైన భయాలూ దాన్ని ఆపలేవని నిరూపించిన చారిత్రక ప్రేమకథ ఇది. పోలెండ్‌లోని నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపులో గార్డగా పని చేస్తాడు ఫ్రాంక్. అతడు ఎలా ఉంటాడు? అడగాల్సిన అవసరం లేని ప్రశ్న ఇది. ఎందుకంటే ఫ్రాంక్ కూడా జాత్యాహంకారంతో, యూదు వ్యతిరేకతతో... మిలిగిన నాజీలలాగే కఠినంగా ఉంటాడు. 1933... హిట్లర్ పవర్లోకి వచ్చిన రోజులవి. నాజీలలో విజాతి వ్యతిరేకత అగ్గిలా ఎగిసిపడుతోన్న దినాలవి. పోలెండ్‌లోని కాన్సన్ట్రేషన్ క్యాంప్‌లో భయం రాజ్యమేలుతోంది. జర్మన్ ఆక్రమిత ప్రాంతాలలోని యూదులు, కమ్యూనిస్ట్ ప్రేమికులు మొదలైన వాళ్లు దీనిలో బందీలు. అలాంటి వాళ్లలో హెలెనా సిట్రోనోవా ఒకరు. స్లొవేకియాకు చెందిన హెలెనా యూదు మతంలో పుట్టడమే తప్పైపోయింది. చేయని నేరానికి డెత్ క్యాంపులోకి వచ్చి పడింది. కొందరిని మాట కలుపుతుంది. కొందరిని పాట కలుపుతుంది. కరడుగట్టిన మూర్ఖ భావాలతో రగిలిపోయే ఫ్రాంక్, కలువపువ్వులాంటి హెలెనాతో ప్రేమలో పడడానికి కారణం మాత్రం పాట! ఒకానొకరోజు డెత్క్యాంప్లో ఒంటరిగా పాట పాడుకుంటోంది హెలెనా. అది ఫ్రాంక్ విన్నాడు. ఆమె గొంతు, పాడిన విధానం ఫ్రాంక్‌కు తెగ నచ్చేశాయి. అందుకే తన పుట్టిన రోజు వేడుకలో ఆ అమ్మాయితో పాట పాడించుకున్నాడు. ఇక ఆరోజు నుంచి హెలెనాను మౌనంగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఏదో ఒక సాకుతో ఆ అమ్మాయితో మాట్లాడేవాడు. అదేంటో తెలియదుగానీ, హెలెనాని ప్రేమించడం మొదలు పెట్టినప్పటి నుంచి అతనిలో కోపం మాయమైంది. ఎప్పుడూ ద్వేషం, అశాంతితో నిండి ఉండే అతని హృదయం ప్రశాంత సరోవరం అయింది. ఓసారి ఒక మూల పనిచేసుకుంటున్న హెలెనాపై ఒక చీటీ విసిరాడు ఫ్రాంక్. ఆ చిన్న చీటీలో పెద్ద మాట ఉంది... ‘ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ.’ ‘పిచ్చివాడిలా ఉన్నాడు’ అని నవ్వుకుంది హెలెనా. సరదా కోసం అలా రాసి ఉంటాడని కూడా అనుకుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ తన పట్ల అతడి కళ్లలో కనిపించే నిజాయితీని గమనించింది. తనకు తెలియకుండానే ఫ్రాంక్ ప్రేమలో పడిపోయింది. గంటల తరబడి మాటలు లేవు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. చూపులతోనే వారి మనసులు ముడిపడి పోయాయి. సమయం చూసుకొని, అందరి కళ్లూ గప్పి, హెలెనాని, ఆమె అక్కని క్యాంపు నుంచి తప్పించాడు ఫ్రాంక్. వాళ్లు ఇజ్రా యెల్ వెళ్లి తలదాచుకున్నారు. అయితే ఆ తర్వాత ఫ్రాంక్, హెలెనాలు కలుసు కున్నారా, మనసు విప్పి మాట్లాడు కున్నారా, ఇద్దరూ ఒక్కటయ్యారా అన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు. అది నేటికీ రహస్యమే. అయితే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం మాత్రం....అతని హృదయంలో ఆమె, ఆమె హృదయంలో అతడు ముద్రపడిపోయారని! వారి ప్రేమ అజరామరమైనదని!! * ఫాంక్, హెలెనాల ప్రేమకథపై ఇజ్రాయెల్ టీవీలో 2003లో ‘ఏ డిఫరెంట్ లవ్ స్టోరీ’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది. * వీరి ప్రేమకథపై ‘ఫర్ సచ్ ఏ టైమ్’ అనే నవల వచ్చింది. కేట్ బ్రెస్ట్లిన్ రాసిన ఈ నవల ‘ఇన్స్పిరేషనల్ రొమాంటిక్ నావెల్’గా గుర్తింపు పొందింది.