ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత
సాక్షి, ముంబై: హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత నీరజ్ వోరా(54) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేటి (గురువారం) వేకువజామున ముంబైలో చనిపోయినట్లు సన్నిహితులు వెల్లడించారు. రచయితగా నటుడు ఆమిర్ ఖాన్ మూవీ 'రంగీలా'కు రైటర్‌గా పనిచేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నీరజ్. సినిమాలపై ఆసక్తితో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు.
ఆపై ఎన్నో సినిమాలకు రచయిగా సేవలు అందించిన అనంతరం 2000లో విడుదలైన కిలాడీ 420 మూవీతో దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తిన 'నీరజ్ వోరా ఫిర్ హెరా ఫెరి'కి కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2016 అక్టోబర్‌లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లిపోయారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఇలా విభాగాల్లో విశేష సేవలందించిన నీరజ్ వోరా గురువారం వేకువజామున మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.