విండీస్ జట్టు స్థానంలో భారత్ లో శ్రీలంక పర్యటన!
కొలంబో: భారత పర్యటన నుంచి వెస్టిండీస్ తప్పుకున్న నేపథ్యంలో శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఖారారు చేసింది. భారత్ లో శ్రీలంక పర్యటన ఖారారైందని, అయితే ఇంకా షెడ్యూల్ ఫిక్స్ కాలేదని శ్రీలంక క్రికెట్ సెక్రెటరీ నిశాంత రణతుంగ తెలిపారు.
విండీస్ బోర్డుకు, క్రికెటర్లకు మధ్య జీత భత్యాల చెల్లింపుపై విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన నుంచి వెస్టిండీస్ జట్టు వైదొలగిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనకు ప్రత్యామ్నాయంగా శ్రీలంక జట్టు పర్యటనను బీసీసీఐ ఖారారు చేసింది.