Nizamuddin Dargah Clerics
-
ఆ దర్గాలో మహిళల ప్రవేశంపై నేడు హైకోర్టు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని హజ్రత్ నిజూముద్దీన్ దర్గాలోనికి మహిళ ప్రవేశం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించనుంది. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకుని దర్గాలో మహిళలను అనుమతించాలని పూణేకు చెందిన న్యాయ విద్యార్ధినులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 27న తాము దర్గాను సందర్శించేందుకు వెళ్లగా దర్గా వెలుపల మహిళలకు ప్రవేశం లేదని నోటీసు అతికించారని పిటిషన్లో వారు పేర్కొన్నారు. దర్గాలోనికి మహిళల ప్రవేశాన్ని అనుమతించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులతో పాటు దర్గా నిర్వహణ కమిటీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. మహిళల ప్రవేశాన్ని అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేయాలని కోరారు. నిజాముద్దీన్ దర్గా బహిరంగ ప్రదేశమని, మసీదులోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం లింగ వివక్షగా పరిగణించాలని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ముంబైలోని హజి అలీ దర్గా, అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాల్లో మహిళలను అనుమతిస్తున్న ఉదంతాలను పిటిషన్లో వారు ప్రస్తావించారు. -
ఇద్దరు భారత మతగురువులు క్షేమమే
-
ఇద్దరు భారత మతగురువులు క్షేమమే: పాక్
కరాచీ/న్యూఢిల్లీ : పాకిస్తాన్లో అదృశ్యమైన భారత ముస్లిం మతగురువులు క్షేమంగా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. భారత్ నుంచి లాహోర్‌కు వెళ్లి అదృశ్యమైన హజ్రత్ నిజాముద్దీన్ దర్గా పీఠాధిపతి సయ్యద్ అసిఫ్ నిజామీ(80), ఆయన మేనల్లుడు నాజిమ్ నిజామీ శనివారం సాయంత్రం కరాచీకి చేరుకున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. మార్చి 20న వారిద్దరు భారత్‌కు తిరిగిరానున్నారు. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తార్ అజీజ్‌తో ఫోన్లో మాట్లాడిన తర్వాత పాక్ ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. మార్చి 8న పాక్‌లోని తన సోదరిని చూడడానికి బయలుదేరిన అసిఫ్ నిజామీ 14న లాహోర్‌కు చేరుకున్నారు. తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. నిషేధిత ముత్తహిద క్వామీ మూవ్‌మెంట్‌తో(ఎంక్యూఎం) సంబంధాలున్నాయన్న ఆరోపణలతో వీరిని పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నాయి. రహస్య ప్రాంతానికి తరలించి విచారణను ప్రారంభించాయి. మరోవైపు ఎటువంటి కమ్యూనికేషన్ లేని మధ్యసింధ్ ప్రాంతంలో ఇద్దరు మతగురువులు చిక్కుకోవడంతోనే ఎటువంటి వివరాలు తెలియరాలేదని పాక్ మీడియా పేర్కొంది. కాగా, వీరిద్దరూ రేపు(సోమవారం) ఢిల్లీ చేరుకుంటారని ట్విటర్ ద్వారా సుష్మా స్వరాజ్ వెల్లడించారు.