Nubia brand
-
నుబియా నుంచి అధునాతన గేమింగ్ ఫోన్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన నుబియా భారత్‌లో రెడ్‌మ్యాజిక్ 3 పేరుతో ప్రపంచంలోనే తొలిసారిగా యాక్టివ్ కూలింగ్ వ్యవస్థతో కూడిన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. గేమింగ్ సమయంలో ఫోన్లో ఉత్పన్నమయ్యే వేడిని బయటకు పంపి చల్లబరిచేందుకు అంతర్గతంగా ఫ్యాన్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో గేమ్‌బూస్ట్ బటన్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6.65 అంగుళాల అల్ట్రా వైడ్ స్క్రీన్, 90హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తోకూడిన అమోలెడ్ డిస్ప్లే, 4డీ వైబ్రేషన్, ముందు భాగంలో రెండు స్టీరియో స్పీకర్లు, 27వాట్ల క్విక్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉన్నాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు మొదలవుతాయని, ధర రూ.35,999గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. -
సూపర్ ఫీచర్స్‌తో నుబియా స్మార్ట్‌ఫోన్
బీజింగ్ : స్మార్ట్ ప్రపంచంలోకి సరికొత్త ఫోన్ రాబోతుంది. జీటీఈ అనుబంధ సంస్థ నుబియా, నుబియా ఎన్3 పేరుతో అదిరిపోయే ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. ఈ కంపెనీ నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో ఫోన్ రిలీజ్ కాబోతుందని పుకార్లు షికార్లు చేశాయి. వాటిని నిజం చేస్తూ.. కంపెనీ నుబియా ఎన్3ని ఈ నెల 24న చైనా మార్కెట్లో విడుదల చేయనుంది. భారీ బ్యాటరీ, బిగ్ స్క్రీన్ దీని ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. మొత్తం మూడు రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే ఫోన్ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్తో ప్రపంచ మార్కెట్లను అలరించనుందనే అంచనా ఉన్నప్పటికీ.. ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్సే. నుబియా ఎన్3 ఫీచర్స్ 18:9 ఐపీఎస్ ఎల్సీడీ 5.99 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ 128జీబీ వరకు విస్తరించుకోవచ్చు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆటో ఫోకస్‌తో వెనుక రెండు కెమెరాలు 5000 యంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ లాక్ సిస్టమ్ -
భారత్‌కు నూబియా బ్రాండ్ స్మార్ట్ఫోన్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనాకు చెందిన జడ్‌టీఈ అనుబంధ కంపెనీ నూబియా బ్రాండ్ భారత్‌లో అడుగుపెడుతోంది. ఆన్లైన్ ద్వారా మొబైల్ ఫోన్లను విక్రయించేందుకు నూబియా రెడీ అయింది. ముందుగా జడ్9 మిని స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1,080/1,920 పిక్సెల్ రిసొల్యూషన్ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్, 4జీ, అక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 16 మెగాపిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ధర రూ.15 వేలుండొచ్చు. ఇక ఇప్పటికే జడ్‌టీఈ పలు మోడళ్లను భారత్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. నూబియా స్మార్ట్ఫోన్ల ధర రూ.7,500ల నుంచి ప్రారంభం. నూబియా ఎక్స్6 మోడల్ ధర అత్యధికంగా రూ.50 వేలుంది. భారత మార్కెట్ కోసం నూబియా.ఇన్ వెబ్‌సైట్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ కంపెనీ ఖాతాలు తెరిచింది.