నూజివీడులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నూజివీడు : కృష్ణా జిల్లా నూజివీడులో బుధవారం ఉదయం స్థానిక అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం దుండగలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ట్రిపుల్ ఐటీ కళాశాల సమీపంలోని పొదల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీటిని దాచారనే సమాచారంతో అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించగా 25 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ దుంగలను అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.