నా కూతుర్ని బాగా చూస్కో అన్నా..
బుక్కరాయసముద్రం : అన్నా నా కూతురుని బాగా చూస్కో... నాకున్న ఇళ్లు ప్లాటు అమ్మి అయినా సరే కూతురికి ఉద్యోగం తెప్పించాలి... అని ఓ వ్యక్తి లెటర్ రాసి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం పాతూరులోని ఉమానగర్‌కు చెందిన బండి ఓబిలేసు (51 ) చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉండేవాడు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
కుటుంబ కారణాలతో ఓబిలేసు గత 4 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులకు పురుగు మందు తాగి చనిపోతాను అంటూ బుధవారం ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడంతో బంధువులు వెతికారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా దయ్యాలకుంటపల్లి సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏఎస్ఐ జనార్ధన్ ఆద్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టాగా.. శుక్రవారం దయ్యాలకుంటపల్లి కొండ సమీపంలో శవం ఉన్నట్లు గుర్తించారు.
కూల్ డ్రింక్‌లో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్ట్ కోసం తరలించారు. మృతుడు ఒక లెటర్లో నా కూతురిని బాగా చూస్కో అన్నా... నా కూతరు ఉద్యోగానికి నా ఇంటి ప్లాటును అమ్మి అయినా సరే ఉద్యోగం ఇప్పించాలని రాసి ఉంచినట్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.