ముగిసిన లక్ష కుంకుమార్చన..
చిత్తూరు: చౌడేపల్లి మండలంలో బోయకుండ గంగమ్మ ఆలయంలో రెండు రోజుల క్రితం ఆరంభమైన లక్ష కుంకుమార్చన శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి సుమారు 175 మంది దంపతులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చుట్టపక్కన ఉన్న 10 గ్రామాల ప్రజలు ఆవుల కొబ్బం పండుగను రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ పండుగకు అతిథిగా వచ్చిన వైఎస్సాఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలువురు శాలువాతో సత్కరించారు. పండుగ సందర్భంగా ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం కాటమరాజు దేవున్ని వీధుల్లో ఊరేగించారు. బొమ్మకుండ గంగమ్మ ఆలయం అద్దాల మేడలో 92 కేజీల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించారు. రెండు గాలిగోపురాలకు కళశాలు ఏర్పాటు చేశారు.
(చౌడేపల్లి)