operations halted
-
కరోనా వేవ్: అతిపెద్ద డైమండ్ కంపెనీ మూత
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ రెండోదశలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద డైమండ్ కంపెనీ ‘భారత్ డైమండ్ బోర్స్’ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. మహమ్మారి వ్యాప్తి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు ప్రకటించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజా ఈ నిర్ణయంతో వజ్రాల క్రయ, విక్రయాల్లో ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార కేంద్రం అయిన భారత్ డైమండ్ బౌర్స్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దేశంలోని వజ్రాల ఎగుమతుల్లో 98 శాతం నిర్వహిస్తున్న ముంబైకి చెందిన ఈ కంపెనీలో సోమవారం రాత్రి 8 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బంద్ కొనసాగనుంది. ముంబై బాంద్రాలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో భారత్ డైమండ్ బౌర్స్ ప్రధాన కేంద్రం ఉంది. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం పరిమితుల నేపథ్యంలోతన కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ చెప్పింది. కాగా ముంబైలో అత్యధికంగా 11,163 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి ఈ కేసుల 4,62,302గా ఉంది. -
భారత్‌లో ఆమ్నెస్టి కార్యకలాపాలు బంద్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. భారత ప్రభుత్వం తమను వెంటాడి వేధిస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేయడంతో సిబ్బందిని బలవంతంగా విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఆమ్నెస్టికి విదేశీ నిధులు చట్ట విరుద్ధంగా వస్తున్నాయని, ఆ సంస్థ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్టర్ చేసుకోలేదని చెబుతోంది. ‘‘ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా బ్యాంకు ఖాతాలన్నీ స్తంభించి పోయాయి. సెప్టెంబర్ 10న నుంచి అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. దీంతో మా సంస్థ చేపట్టే పనులన్నీ ఆగిపోయాయి. సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది.’’అని ఆమ్నెస్టీ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండేళ్లుగా కేంద్రం వేధింపులు కేంద్రం తమ సంస్థని రెండేళ్లుగా వేధిస్తోందని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ ఆరోపించారు. ఢిల్లీ ఘర్షణలు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో అల్లర్లలో మానవ హక్కులకు విఘాతంపై తమ సంస్థ ప్రశ్నలు సంధించిందని, ఫలితంగా బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ జరిగిందన్నారు. ఆమ్నెస్టి అనుబంధ సంస్థపై విచారణ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థపై ఈడీ విచారణ చేయడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు కంపెనీ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ అండ్ ఇండియన్స్ ఫర్ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ట్రస్ట్‌ని మనీ ల్యాండరింగ్, ఫారెన్ ఎక్స్ఛేంజ్ నిబంధనల ఉల్లంఘనల కింద విచారిస్తున్నట్టుగా తెలిపాయి. అనుమతుల్లేకుండానే అందుకున్న రూ.51 కోట్లపై విచారిస్తున్నట్టు తెలిపింది. ఆరోపణలు దురదృష్టకరం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపణల్ని హోంశాఖ తిప్పికొట్టింది. ఆ ఆరోపణలు అవాస్తవం, అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. భారత చట్టాలను ఉల్లంఘించి నిధులు తెచ్చుకుంటున్న ఆ సంస్థ తాము చేస్తున్న పనుల నుంచి దృష్టి మరల్చడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా ఆమ్నెస్టీకి నిధులు అందుతున్నాయని, స్వచ్ఛంద సంస్థలకు అలా నిధులు రావడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. యూకే నుంచి 1.60 కోట్ల నిధుల కోసం 2011–12లో అప్పటి ప్రభుత్వం ఆమ్నెస్టీకి అనుమతులి చ్చిందని, 2013 నుంచే యూపీఏ హయాంలోనే అనుమతులు నిలిచి పోయాయని వెల్లడించింది. -
కంటి ఆపరేషన్లు బంద్
10 రోజులుగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులు పట్టించుకోని అధికారులు కంటి ఆపరేషన్లకు అవసరమైన బీఎస్ఎస్ (బయలాజిక్ సాల్ట్ సొల్యూషన్) లేకపోవడంతో శస్త్రచికిత్సలు బంద్ అయ్యాయి. 10 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, ప్రతి రోజూ ఆసుపత్రికి వచ్చి, ఆ మందు రాలేదని తెలుసుకుని తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. గూడూరు: గూడూరు ఏరియా ఆసుపత్రిలో నేత్ర వైద్యనిపుణులుగా పనిచేసే వైద్యులు గోపీనాథ్ శస్త్రచికిత్సల్లో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఆపరేషన్ల కోసం గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, కోట, వాకాడు తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆసుపత్రిలో 10 రోజులుగా ఆపరేషన్‌కు అవసరమైన బీఎస్ఎస్ లేకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఆపరేషన్ల కోసం వచ్చిన వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బీఎస్ఎస్ తెప్పించాల్సిన ఆసుపత్రి అదికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యులు చెపుతున్నారు. ఈ మేరకు డీపీఎంతో మాట్లాడం జరిగిందని, ఆమె కూడా పలు పర్యాయాలు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసినా వారు పంపలేదని, ఈ మందును బయట నుంచి తెప్పించకూడదని ఆమె చెపుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారుల స్పందించి బాగా ఆపరేషన్లు చేసే గూడూరు ఏరియా ఆసుపత్రి వైద్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన మందు సామగ్రిని సరఫరా చేయాలని కూడా కోరుతున్నారు. వాళ్లను తిప్పుకుంటుంటే బాధగా ఉంది : గోపీనాద్. నేత్ర వైద్యులు బీఎస్ఎస్ లేకపోవడంతో ఆపరేషన్లు ఆగిపోయాయి. అది ఎప్పుడొస్తుందో తెలీదు. దీంతో రోజూ వాళ్లు వస్తుంటే ఆ మందు రాకపోవడంతో వాళ్లను తిప్పాల్సి వస్తోంది. ఎన్ని సార్లు తిరగాలి : రమణయ్య, దగ్గవోలు ఆపరేషన్ కోసం రెండు సార్లు వచ్చాం. వస్తే ఆ మందు ఇంకా రాలేదు అంటున్నారు. ఎన్ని సార్లు తిరగగలం. అధికారులు సమస్యను పరిష్కరించాలి.