ఆన్లైన్లో ప్రభుత్వాస్పత్రుల సేవలు
తుర్కపల్లి, న్యూస్‌లైన్: ప్రభుత్వాస్పత్రులలో సేవలు ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తున్నామని డీఎంహెచ్ఓ డాక్టర్ పి.ఆమోస్ తెలిపారు. శుక్రవారం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులు, వివిధ పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన జిల్లామలేరియా అధికారి ఓంప్రకాశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోఉగ్యకేంద్రాలకు ల్యాప్‌ట్యాప్‌లు ఇచ్చినట్టు తెలిపారు.
ప్రతి ఆరోగ్యకేంద్రం సేవలు ఇకనుంచి ఆన్లైన్లో పొందుపరుస్తామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాస్పత్రులలో కాన్పులు జరిగేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సిన్ల వివరాలను పొందుపరుస్తామన్నారు.
కాన్పులకు ప్రోత్సాహకాలు
ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులకు వచ్చేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తున్నామని డీఎంహెచ్ఓ తెలిపారు. గతంలో రెండు కాన్పుల వరకే ప్రోత్సాహకాలిచ్చే వాళ్లమని, ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలిస్తున్నామని పేర్కొన్నారు. ఆ పరేషన్లు కాకుండా సుఖప్రసవాలు జరి గేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రసూతి సేవల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. 104 సేవలను కూడా పెంచి గ్రా మస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి
వర్షకాలం ప్రారంభం.. జూన్, జూలై మాసాలల్లో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి ఓం ప్రకాశ్ అన్నా రు. నీళ్లు నిల్వ ఉండకుండా, డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే దోమలు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు. దోమల వల్ల మలేరియా, డెంగీ,, పైలేరియా, చికున్‌గున్యాలాంటి వ్యాధులు వస్తాయన్నారు. జాన్ నెలలో ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించి నిల్వ నీటిని, మురికి కాలువలను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆవగాహన కల్పించి వాక్సిన్‌లిస్తామని తెలిపారు. వారి వెంట డాక్టర్ రవీందర్, సీహెచ్ఓ శివాజీమానే, లలిత, వసంత, షర్మిలా, ఫార్మాసిస్టు వేణు ఉన్నారు.