Pacipenta
-
విద్యుత్ తీగలకు యువకుడి బలి
పాచిపెంట : విద్యుత్ తీగలకు ఓ వ్యక్తి బలయ్యూడు. సోమవారం అర్ధరాత్రి విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. పాచిపెంట ఎస్సీ కాలనీకి చెందిన రావాడ నాగార్జున (22) ఎలక్ట్రీషియన్ పనులు చేస్తుంటాడు. తండ్రి అనారోగ్యంతో మంచాన పడడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో విద్యుత్ తీగలు సరిచేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి ప్రస్తుతం గర్భవతి. ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. మృతి వార్త తెలియగానే నాగార్జున కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. రాజ్యలక్ష్మి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. ఇక తమకు దిక్కెవరని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఎస్ఐ జి.డి.బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రాజన్నదొర ఓదార్పు మృతి వార్త తెలియగానే ఎమ్మెల్యే రాజన్నదొర సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి రూ. 10 లక్షలు నష్టపరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంబంధిత సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీరు పర్యవేక్షణ లేకపోవడం వల్ల దిగువ స్థాయి సిబ్బంది పనితీరు బాగోలేదన్నారు. సంఘటన స్థలానికి డీఈ స్థాయి అధికారి రాకపోవడం నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు. ఇందుకు కారణమైన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. ఆయనతో వైస్ ఎంపీపీ టి.గౌరీశ్వరరావు, ైవె ఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి డోల బాబ్జీ, సలాది అప్పలనాయుడు, ఇజ్జాడ తిరుపతి, సీపీఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు ఉన్నారు. -
భగ్గుమన్న తమ్ముళ్లు
పాచిపెంటలో టీడీపీ మండల సమావేశం హాజరైన మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ సంధ్యారాణి పాచిపెంట: మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్,ఎమ్మెల్సీ సంధ్యారాణి ఎడమోహం పెడమెహంతో ఉండడం వల్ల పార్టీ కార్యకర్తలకు పను లు జరగడం లేదని పలువురు టీడీపీ పాచిపెంట మండల నాయకులు అసహనం వెలిబుచ్చారు. మండల కేంద్రమైన పాచిపెంటలో త్రిమూర్తులు ఆలయ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం టీడీపీ మండలస్థాయి సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ సంధ్యారాణిల వ్యవహార శైలిపై పార్టీ నాయకులు దత్తి పైడిపునాయుడు,గురువునాయుడు పేట వైస్ సర్పంచ్ ముఖి శ్రీరాములు, గొట్టాపుతిరుపతిరావు తదితరులు మాట్లాడుతూ గ్రూపు రాజకీయాల వల్ల మండల అధికారులు ఏ పనులూ చేయడం లేదని, దీంతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే చాలా మంది కార్యకర్తలు పార్టీని వీడే ప్రమాదముందని గురువునాయుడు పేట వైస్ సర్పంచ్ శ్రీరాములు అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పూసర్ల నరిసింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇళ్లు పొందిన వారికి మళ్లీ ఇళ్ల మంజూరు జాబితా పంపించడం వల్ల కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారంటూ భంజ్‌దేవ్, సంధ్యారాణిలపై భగ్గుమన్నారు. మండల పోస్టుల్లో పక్కవారా? పాచిపెంట మండలానికి చెందిన పారమ్మ కొండ కమిటీకి సంబంధించి సాలూరు ప్రాంతానికి చెందిన వారిని నియమించడం ఏమిటని ప్రశ్నించారు.మండలానికి మంజూరైన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో కూడా మండలానికి చెందిన వారిని కాకుండా ఇతర మండలాలకు చెందిన వారిని నియమించడం ఏమిటని మండిపడ్డారు. పాచిపెంట పెద్దగెడ్డ జలాశయానికి సంబంధించి నీటి సంఘం అధ్యక్షుడుగా సాలూరుకు చెందిన వారిని నియమించడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం భంజ్‌దేవ్ మాట్లాడుతూ మండల అధికారులు పనులు చేసేలా తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆ తరువాత సంధ్యారాణి మాట్లాడుతూ తమ మధ్య విభేదాలు లేవని ఇళ్ల ప్రతిపాదనలను అధికారులు పంపించారని, పార్టీ పరువు పోతుందని తానేమీ మాట్లాడలేదన్నారు. సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు లండ సత్యనారాయణ,కో ఆప్షన్ సభ్యుడు చోటా, పార్టీ సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. -
నూతిలో జారిపడి..
కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని ప్రమాణం చేసి వివాహ బంధంతో ఒక్కటయ్యే దంపతులు ఎంతమంది ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటారో కానీ ఈ గిరిజన దంపతులు అక్షరాలా కట్టుబడ్డారు. ఏడాదికోసారి వచ్చే క్రిస్మస్ సంబరాన్ని ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా చేసుకున్న ఈ దంపతులు ఆ తర్వాత మృత్యుప్రయాణంలోనూ ఒకరివెంట ఒకరు నడిచారు. నూతిగట్టుపై సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటున్న భార్యాభర్తలు ఒకరిని కాపాడబోయి మరొకరు నూతిలో జారిపడి మంగళవారం రాత్రి మృతి చెందారు. వలెసల మడ (పాచిపెంట), న్యూస్‌లైన్: పాచిపెంట మండలంలోని కొటికిపెంట పంచాయతీ వలెసెల మడ గ్రామానికి చెంది న సొయ్యారి అప్పలస్వామి (40), సోంబ్రూ (35) భార్యాభర్తలు. ఆ గిరిజన దంపతులు ప్రమాదవశాత్తు నూతిలో జారిపడ్డారు. జరిగిన సంఘటనపై స్థానికులు, పాచిపెంట ఎస్.ఐ సి.హెచ్. స్వామినాయుడు తెలిపినవివరాలిలా ఉన్నాయి. ఈ గిరిజన గ్రామంలో కేవలం 11 ఇళ్లు ఉన్నాయి. ఇళ్లన్నీ దూరదూరంగా ఉంటాయి. చీకటి పడిపోగానే ఈ గ్రామస్తులు ఎవరింటికి వారే పరిమితమవుతారు. ఒకరి సమాచారం మరొకరికి తెలియదు.అయితే పిల్లలు నిద్రపోయాక అప్పలస్వామి దంపతులు పక్కనే ఉన్న నూతి గట్టుపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పొరపాటున ఒకరు నూతిలో జారి పడడంతో కాపాడబోయిన మరొకరు కూడా జారిపడి మృతిచెందారు. ఈ దంపతులు మంగళవారం మృతిచెందినప్పటికీ ఇళ్లు దూరదూరంలో ఉండడంతో సమాచారం ఎవరికీ తెలియరాలేదు. బుధవారం ఉదయం నూతికి వెళ్లిన స్థానికులు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు పాచిపెంట ఎస్.ఐ స్వామినాయడితో పాటు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నూతిలోని మృతదేహాలను బయటికి తీయించారు. గ్రామంలో శవపంచనామా జరిపించి పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనాథలైన పిల్లలు అప్పలస్వామి,సోంబ్రూ మృతితో వారి ముగ్గురు పిల్లలు సీతమ్మ (11)లక్ష్మణ (9) లచ్చమ్మ(6)లు అనాథలయ్యారు. అభంశుభం తెలియని గిరిజన పిల్లలను చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. సంఘటనా స్థలం దగ్గర పిల్లలు ఏడుస్తుంటే చూస్తున్న పలువురు బాధను ఆపుకోలేకపోయారు. మృతుల కుమారుడు లక్ష్మణ పాచిపెంటలోని గిరిజన బాలుర వసతి గృహంలో చదువుతున్నాడు. అనాథలైన ఈ పిల్లలను ప్రభుత్వం ఆదు కోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. -
కాంగ్రెస్ దుకాణం బంద్...!
పాచిపెంట,న్యూస్‌లైన్: సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఏజెన్సీ రాజకీయాల్లో నూతనోత్తేజం కలిగించారు. కాంగ్రెస్‌కు కష్టకాలం దాపురించింది. దీంతో అక్కడ ఆ పార్టీ దుకా ణం బంద్ అయినట్లేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరున్న రాజన్న దొర మొదట్నుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమాని. ఆయన ఆశీస్సులతోనే దొర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే మహానేత వైఎస్ మరణానంతరం రాష్ట్రరాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ రాజన్నదొర మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు. అయితే ఆయన పరిస్థితి రోజురోజుకూ ఇబ్బందికరంగా మారడం, నియోజకవర్గంలోని పాలనా వ్యవహారాలు సైతం విజయనగరం నుంచి షాడోనేతే పర్యవేక్షిస్తుండడంతో దొర అనుచరుల్లో ఆవేదన వ్యక్తమయ్యేది. అయినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొన్నాళ్లు అలాగే ఉన్నారు. ఇదే తరుణంలో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు తేటతెల్లమవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైం ది. రాజన్న ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి వారు కోరిన మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో ఆయన చేరికతో పా చిపెంట, మెంటాడ, సాలూరు, మక్కువ మం డలాల్లో రాజకీయ సంచలనం రేగింది. రాజన్నతోపాటు జరజాపు ఈశ్వరరావు, పాచిపెంట మండలం నుంచి మరో 13మంది సర్పంచ్‌లు పార్టీలో చేరారు. రాజన్న దొర హైదరాబాద్ నుంచి వచ్చాక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొం దిస్తారు. ఈలోగా ఆయా మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎం పీటీసీ మాజీ సభ్యులు సైతం ఇదే బాటన ప యనించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో నైరాశ్యం ఇదిలా ఉండగా అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఈ పరిణామం నైరాశ్యాన్ని నింపింది. దొర నిష్ర్కమణతో కాంగ్రెస్‌కు నియోజకవర్గంలో పెద్దదిక్కే లేకుండా పోయింది. అంతేకాకకుండా ఇప్పుడు తమను నడిపించే నాయకుడెవరన్న ప్రశ్న వారిలో ఆందోళన కలిగిస్తోంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు కనీసం మండల స్థాయి నేత కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని మక్కువ మండలానికి చెందిన ఓ సర్పంచ్ నిర్వేదం వ్యక్తం చేశారు. దొర చేరికతో గిరిజనుల్లో సైతం ఉత్సాహం నెలకొంది. తాము మొదట్నుంచీ అభిమానించే రాజశేఖరరెడ్డి తనయుడు ఏర్పాటు చేసిన పార్టీలోకి దొర వెళ్లడం చాలా ఆనందకరమని పణుకువలస, పి.కోనవలస, వేటగానివలస తదితర గిరిజన గ్రామాలకు చెందిన యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందని, దుకా ణం బంద్ అయినట్లేనని వారు చెబుతున్నారు.