' పల్లె బాట' ను ప్రారంభించిన పెద్దిరెడ్డి
చిత్తూరు: గ్రామ సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన పల్లె బాట కార్యక్రమాన్ని పుంగునూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు. జిల్లాలోని సోదుం మండలంలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రజల కష్టసుఖాలను దగ్గరగా తెలుసుకోవడానికి వీలుంటుందని వైఎస్సార్సీసీ నాయకులు తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా 16 పంచాయతీల్లోని 40 గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
(సోదుం)