ఒక్క గోల్‌కు రెండు పాయింట్లు
మారిన హెచ్ఐఎల్ నిబంధనలు
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఆటగాళ్లలో పోరాటపటిమ, క్రమశిక్షణ పెంచేందుకు నిర్వాహకులు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 2016 నాలుగో సీజన్ నుంచి గోల్ స్కోరింగ్‌లో కొత్త నిబంధనలు తేనున్నారు. నైపుణ్యత, వ్యూహాత్మక ఆటతీరును ప్రోత్సహించేందుకు ఫీల్డ్ గోల్స్‌కు రెండు పాయింట్లు, ఆటగాళ్లను మొరటుగా అడ్డుకోవడాన్ని తగ్గించేందుకు పెనాల్టీ స్ట్రోక్‌లకు కూడా రెండు పాయింట్లు ఇస్తున్నట్టు హెచ్ఐఎల్ చైర్మన్ నరీందర్ బాత్రా తెలిపారు.
క్షమాపణలు చెబితేనే...: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు లేదని లీగ్ చైర్మన్ బాత్రా తేల్చి చెప్పారు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై విజయం అనంతరం పాక్ ఆటగాళ్లు ప్రేక్షకులతో అసభ్యంగా ప్రవర్తించారు. పాక్ తమకు ఈ విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని ఆయన గుర్తుచేశారు. క్షమాపణలు చెబితే ఆలోచిస్తామని చెప్పారు.