జిల్లాకు చేరిన డీఎస్సీ జాబితాలు
ఎస్ఎ, పండిట్, పీఈటీ జాబితాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎట్టకేలకు డీఎస్సీ-2014 పాఠశాల సహాయకులు, పండిట్లు, పీఈటీల మెరిట్ జాబితాలు జిల్లాకు చేరాయి. ఇప్పటికే ఎస్జీటీ మెరిట్ జాబితాలు రాగా, మిగిలినవి అనివార్య కారణాలతో రావడంలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అందోళన చెందారు. ఈ పరిస్థితిలో జాబితాలు జిల్లాకు రావడంతో ఉపాధ్యాయుల నియామకాలు త్వరలో చేపట్టే అవకశాలున్నాయి. విద్యాశాఖ అధికారులు మెరిట్ జాబితా, ఖాళీలతో కూడిన వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.