ఇలా ఉండాలట!
కొలత
అందగాడంటే ఇలాగే ఉండాలట! అందగత్తె అంటే ఈవిడేనట! అయితే వీళ్లిద్దరూ నిజమైన వ్యక్తులు కారు. ఈ-ఫిట్ సాఫ్ట్‌వేర్‌తో ఊపిరి పోసుకున్న ఊహా చిత్రాలు. ఫేసియల్ మ్యాపింగ్‌లో నిపుణుడైన డాక్టర్ క్రిస్ సాల్మన్, అయన బృందం కలిసి, బ్రిటన్‌లోని 300 మంది పౌరుల అభిరుచులను సేకరించి ఆడామగల అందానికి కొలమానాలను నిర్ణయించారు. వాటి ప్రకారం తయారైన ముఖారవిందాలే ఇవి.
ప్రధానంగా ముక్కు పొడవు, వెడల్పు, పెదవుల మందం, తల వెంట్రుకల తీరు, దవడల ఆకృతి ఎలా ఉంటే అందంగా కనిపిస్తారు అనే అంశాలపై సాల్మన్ బృందం అభిప్రాయాలను సేకరించి స్త్రీ, పురుషుల అందానికొక కొత్త నిర్వచన రూపం ఇచ్చింది. అయితే ఈ కొలమానం బ్రిటన్‌కు మాత్రమే పరిమితం అనీ, ఆసియా దేశాలవారి రూపలావణ్యాల కొలబద్దలు అక్కడివారి టేస్ట్‌ను బట్టి ఉంటాయని సాల్మన్ అంటున్నారు.