వేడిని విద్యుత్తుగా మారుస్తాయి...
ఫొటో చూశారా? ఈ బుల్లి నిర్మాణాలు ఓ వినూత్న పదార్థంతో తయారయ్యాయి. వేడిని విద్యుత్తుగా మార్చడం ఈ పదార్థం ప్రత్యేకత. ఇలాంటి థర్మో ఎలక్ట్రిక్ పదార్థాల గురించి చాలాకాలంగా తెలిసినప్పటికీ ఫ్రాన్హోవర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వాడుకునేందుకు వీలైనంత మోతాదులో దీన్ని తయారు చేశారు.
వాహనాల పొగ గొట్టాల్లో ఇలాంటి వాటిని అమర్చుకున్నామనుకోండి. అక్కడికక్కడే విద్యుత్తు తయారవుతుంది. విద్యుత్తుతో పనిచేసే ఇతర పరికరాలపై భారాన్ని తగ్గిస్తుంది.