భారత్‌లో రికార్డుకెక్కిన టెన్నిస్ పాఠం
చెన్నై: భారత్‌లో టెన్నిస్ పాఠం గిన్నీస్ రికార్డులకెక్కింది. దీనికి చెన్నై ఓపెన్ వేదికైంది. ఈ టోర్నీ ప్రచారం కోసం మంగళవారం ‘ప్లే ద ప్రోస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఒకేసారి 956 మంది చిన్నారులు టెన్నిస్ నేర్చుకున్నారు. ఇంత భారీస్థాయిలో ఓ క్రీడను నేర్చుకోవడం ప్రపంచ రికార్డు సృష్టించింది.
గతంలో 803 మందితో ఉన్న గిన్నిస్ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. 2015లో లండన్‌లోని లివర్‌పూల్‌లో 803 మంది ఆట నేర్చుకోవడమే ఇప్పటి వరకు రికార్డు. ఇప్పుడీ రికార్డుచెన్నైలో తుడిచిపెట్టుకుపోయింది. భారత దిగ్గజం లియాండర్ పేస్, రోహన్ బోపన్న సర్వీస్ చేయడాన్ని, ఏస్‌లు, వాలీస్, బేస్‌లైన్ నుంచి ఫోర్‌హ్యాండ్ షాట్లను చిన్నారులంతా ఆసక్తిగా నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఫొటో సెషన్ నిర్వహించగా అభిమానులు, చిన్నారులు పేస్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.