ఫ్యామిలీ ఎంటర్టైనర్
‘‘ఫ్యామిలీ డ్రామాలకు, ప్రేమ కథలకు నేను దూరం. కానీ, మొదటిసారి రియలిస్టిక్‌గా ఉండే ఫ్యామిలీ కథా చిత్రం చేయాలని భావించాను. ఇందులో క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి’’ అని దర్శకుడు శేఖర్ సూరి అన్నారు. రిషి, సోనియామాన్ జంటగా శ్రీ వెంకటేశ్వర సూపర్ మూవీస్, స్ట్రీట్ ప్లే ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై వెంకటేశ్వర్లు, శేఖర్ సూరి, బి.ఆర్. రత్నమాలారెడ్డి నిర్మిస్తున్న ‘డా. చక్రవర్తి’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అగార్కర్, కిషోర్, అశోక్ మున్ని కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘అవుట్ అండ్ అవుట్ ప్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని నిర్మాతల్లో ఒకరైన వెంకటేశ్వర్లు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కురాకుల, కెమెరా: రాజేంద్ర, మాటలు: వి.ఆర్.ఎన్. శర్మ.