మనమ్మాయికి అన్ని వర్సిటీల ఆహ్వానం
వాషింగ్టన్: ఏదో ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం వస్తే చాలని దరఖాస్తు చేసుకున్న భారత సంతతికి చెందిన 17యువతి అదృష్టం పండింది. అమెరికాలోని 14 యూనివర్సిటీల్లో ఆమె ప్రవేశానికి అనుమతి రాగా వాటిల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన ఎనిమిది విశ్వవిద్యాలయాలున్నాయి.
వర్జీనియాకు చెందిన పూజా చంద్రశేఖర్ ఇంటర్ పూర్తి చేసి తదుపరి విద్యాభ్యాసం కోసం ఏదైనా టాప్ వర్సిటీలో చదవాలనుకుంది. అందుకోసం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన హర్వార్డ్, యేల్, ప్రిన్సటన్, కార్నెల్, డార్ట్మౌత్, కొలంబియా, బ్రౌన్, పెన్సిల్వానియా యూనివర్సిటీలకు దరఖాస్తు చేయగా ఆశ్చర్యం గొలిపేలా అన్ని వర్సిటీల్లో చేరేందుకు అవకాశం వచ్చి వాలింది. పూజా వాళ్లు బెంగళూరుకు చెందినవారు. తల్లిదండ్రులు ఇద్దరు ఇంజినీర్లే. ఈ వర్సిటీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 2,400 మార్కులకుగానూ 2390 మార్కులను పూజా పొందింది.