Porterfield
-
ఐర్లాండ్‌పై శ్రీలంక గెలుపు
మాలాహైడ్ (ఐర్లాండ్): ఆల్‌రౌండర్ షనక (42; 5/43) దుమ్మురేపడంతో... గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 76 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) ఐర్లాండ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 303 పరుగులు చేసింది. చండిమల్ (107 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. తర్వాత ఐర్లాండ్ 40.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. పోర్టర్‌ఫీల్డ్ (73), కెవిన్ ఓబ్రియాన్ (64) మినహా మిగతా వారు విఫలమయ్యారు. వర్షం వల్ల ఐర్లాండ్‌కు 47 ఓవర్లలో 293 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. -
పోర్టర్ ఫీల్డ్ సెంచరీ
అడిలైడ్: పాకిస్థాన్ తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ పోర్టర్ ఫీల్డ్ సెంచరీ సాధించాడు. 124 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ. 107 పరుగులు చేసి పోర్టర్ ఫీల్డ్ ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఐర్లాండ్ 40 ఓవర్లలో 188/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. బాల్బిర్ని18, ఒబ్రెయాన్ 12, జాయ్స్ 11, స్టిర్లింగ్ 3 అవుటయ్యారు.