ప్రిక్వార్టర్స్‌లో పేస్, బోపన్న జోడీలు
పారిస్: భారత వెటరన్ స్టార్ లియాండర్ పేస్ జోడితో పాటు రోహన్ బోపన్న ద్వయం బీఎన్పీ పారిబా ఏటీపీ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. కెనడాకు చెందిన డానియెల్ నెస్టోర్తో కలిసి పేస్ జంట ఏడో సీడ్‌గా, రోజర్ వాసెలిన్ ఎడ్యుర్డ్ (ఫ్రాన్స్)తో బోపన్న జోడి ఐదో సీడ్‌గా బరిలోకి దిగాయి. అయితే ఈ రెండు జంటలకు తొలి రౌండ్లో బై లభించింది. దీంతో గాంజలెజ్-స్కాట్ లిప్స్కీ... జేమి ముర్రే-జాన్ పీర్స్ల మధ్య మ్యాచ్ విజేతతో ప్రిక్వార్టర్స్‌లో పేస్ జోడి తలపడనుంది. ఇస్నర్-మోన్రో... జొనాథన్-సిజ్స్లింగ్ల మధ్య తొలి రౌండ్ విజేతతో బోపన్న జోడి పోటీపడుతుంది.