తక్షణం నివేదిక ఇవ్వండి
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: భూత్పూర్ మండల కేంద్రంగా జరుగుతున్న నా సిరకం విత్తనాల తయారీ, అమ్మకాలపై తక్షణమే నివేది క ఇవ్వాలని కలెక్టర్ ఎం. గిరిజాశంకర్ ఆదేశించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ‘విత్తు..రైతన్న చిత్తు’ శీర్షికన ప్రచు రితమైన కథనానికి స్పం దించిన కలెక్టర్ వ్యవసాయాధికారులపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
దీంతో సోమవారం ఉదయాన్నే జడ్చ ర్ల సహాయ వ్యవసాయ సంచాలకురాలు నిర్మల, భూ త్పూర్ మండల వ్యవసాయాధికారిణి బ్యూలా భూత్పూర్ మండల పరిధిలో ఉన్న విత్తనాల తయారీ కంపెనీలపై దాడులు నిర్వహిం చారు. అడ్డాకుల మండల ఏఓ తన మండల పరిధిలోని విభా సీడ్స్‌ను తనిఖీ చేశారు. షాద్‌నగర్, జడ్చర్ల మండలాల పరిధిలో ఉన్న విత్తన కంపెనీలపై ఆయా మండలాల ఏఓలు తనిఖీలు జరిపి ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు తయారు చేశారు.. ఎన్నింటిని విక్రరుుంచారు అనే వివరాలను సేకరించి నివేదికలను తయారు చేశారు.
ముందే లీకు?
భూత్పూర్ మండల పరిధిలోని కంపెనీలపై దాడులు జరగనున్నట్లు కంపెనీల యాజమానులకు ముందే సమాచారం అందింది. దీంతో కంపెనీల యాజమానులు తెలివిగా సోమవారం తమ కంపెనీలకు సెలవు ప్రకటించి, పనులకు పుల్‌స్టాప్ పెట్టారు. దీంతో పాటు విత్తనాల ప్యాకెట్లు, ముడి విత్తనాలను గోదాంలో దాచి ఉంచారు.
కంపెనీల యాజమానులు అనుకున్నట్లుగానే అధికారులు మొక్కుబడిగా తనిఖీ చేసి వెళ్లిపోవడంతో కంపెనీల యాజమానులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా అమిస్తాపూర్‌లోని ఓ కంపెనీ గుజరాత్ రాష్ట్రంలోని ఓ చిరునామాతో కల్పవృక్ష అనే బీటీ విత్తనాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల రాక అందుకున్న ఆ కంపెనీ యజమాని వాటిని హుటాహుటిన వేరే చోటుకు తరలించినట్లు సమాచారం. జడ్చర్ల అడ్రస్‌తో లెసైన్స్ పొంది భూత్పూర్లో నిర్వహిస్తోన్న మరో కంపెనీ యజ మాని కూడా అధికారుల రాక తెలుసుకొని వేరే చోటుకు విత్తనాలను తరలించినట్లు తెలిసింది. కాగా అధికారులు విత్తనాల తయారీ కంపెనీల గోదాంలను కానీ, ప్యాకిం గ్ పాయింట్లను కానీ తనిఖీ చేసిన దాఖలాలు కనిపించలేదు. ఏదో మొక్కబడిగా తనిఖీలు జరిపి ఏమీ తేల్చకుండానే వెనుదిరిగారు.
నాసిరకం విత్తన తయారీదారులపై చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ఎక్కడైనా నాసి రకం విత్తనాలు తయారు చేసినా, అమ్మినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విత్తన కంపెనీలను పరిశీలించి, వాటిపై నివేది క సమర్పించాలని ఇప్పటికే అధికారులకు సూచించాం. నివేదిక ఆధారంగా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి నుంచి ఆయా కంపెనీలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. - జేడీఏ భగవత్ స్వరూప్