లైంగికదాడుల నివారణపై అవగాహన
వేలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు లైంగికదాడుల నివారణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లైంగికదాడుల నివారణపై రెండు రోజుల పాటు జరుగనున్న అవగాహన కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ లైంగికదాడులకు పాల్పడే వారికి కఠిన శిక్ష పడే చట్టాలున్నాయన్నారు. ఆడ పిల్లల పట్ల ఎవరైనా ప్రేమగా మాట్లాడుతున్నారా లేక వ్యత్యాసంగా మాట్లాడుతున్నారా అనే విషయాలను తరచూ తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు.
జిల్లాలో లైంగికదాడుల కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు లైంగికదాడుల నివా రణపై అవగాహన కల్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు, వసతి గృహాల వద్ద కూడా అవగాహన కల్పిస్తే జిల్లాలో పూర్తిగా లైంగికదాడుల కేసు లు లేకుండా చేయవచ్చునన్నారు. ప్రస్తుతం శిక్షణ పొం దుతున్న అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆయా తాలుకా కేంద్రాల్లో లైంగికదాడుల నివారణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. శిశు సంక్షేమ శాఖ అధికారి శరవణన్, అసిస్టెంట్ డెరైక్టర్ కల్పన, మహిళా వసతి గృహం సూపర్వైజర్ ఉమామహేశ్వరి, సీనియర్ న్యాయవాది వీరరాఘవులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.