Private employment
-
ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు : హర్యానా హై కోర్టు
న్యూఢిల్లీ : స్థానికులకు తక్కువ వేతనాలున్న ప్రయివేటు ఉద్యోగాల్లో 75శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్నిపంజాబ్, హర్యానా హై కోర్టు కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. మరో ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ టైమ్‌లో హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్‌ను హై కోర్టు కొట్టివేయడం అధికార బీజేపీకి పెద్ద దెబ్బ అనే ప్రచారం జరగుతోంది. రాష్ట్రంలోకి భారీగా వలస వచ్చిన వారిని స్థానికంగా ప్రయివేటు ఉద్యోగాల్లోకి రాకుండా నిలువరించేందుకే ఈ చట్టం తీసుకువచ్చినట్టు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది.ముఖ్యంగా 30 వేల రూపాయలలోపు వేతనాలున్న ఉద్యోగాల్లోకి వలసవచ్చినవారు చేరడం వల్ల స్థానికుల్లో పేదరికం పెరిగిపోతుందని పేర్కొంది. ఈ చట్టాన్ని 2020లో అసెంబ్లీలో పాస్ చేశారు.రాషష్ట్రంలో కీలకంగా ఉన్న జాట్ల ఓట్లపై కన్నేసి ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రచారం జరిగింది. నిజానికి ఈ చట్టం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. బీజేపీ ప్రభుత్వంతో జననాయక్ జనతా పార్టీ చేరడమే కాకుండా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా కూడా పనిచేస్తున్నారు. ఇదీచదవండి..ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్ -
ప్రభుత్వ ఉద్యోగమిస్తామని ఎక్కడా చెప్పలేదు
ఇంటికో ఉద్యోగం హామీపై నారా లోకేశ్ భాష్యం సాక్షి, రాజమహేంద్రవరం: గత ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీపై సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన భాష్యం చెప్పారు. ఇంటికో ఉద్యోగమిస్తామని తమ పార్టీ చెప్పింది తప్ప అది ప్రభుత్వ ఉద్యోగమని ఎక్కడా చెప్పలేదని బుకాయించారు. ఇంటికో ఉద్యోగం అంటే అది ప్రైవేటు ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలైనా అందులోకే వస్తాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసినప్పుడు అవి కూడా ఈ లెక్కలోకే వస్తాయన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నన్నయ్య యూనివర్సిటీ, వికాస, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాను లోకేశ్ ప్రారంభించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తాము రాష్ట్రాన్ని పాలించేందుకు ఐదేళ్లకు ఓట్లు వేశారని, తాము ఎక్కడికీ పారిపోవట్లేదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పామన్న లోకేశ్ నిరుద్యోగులను ఆదుకుంటామ న్నారు. రెండేళ్లలో చంద్రబాబు వేసిన పునాది వల్ల దాదాపు లక్ష ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.