Pushkaralu
-
గంగానదీ పుష్కరాలు.. కాశీకి పోలేము రామా హరీ..!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి వారణాసి మీదుగా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వెయిటింగ్ లిస్టు 400ను దాటింది. మే మొదటివారం వరకు ఇదే పరిస్థితి. గత రెండు నెలల నుంచి వచ్చేనెల వరకు వెయింటింగ్ చూపుతున్నా ఈ మార్గంలో మరో అదనపు రైలును అధికారులు నడపటం లేదు. వారణాసి పుణ్యక్షేత్రానికి నిత్యం తెలంగాణ నుంచి దాదాపు రెండు వేలమంది భక్తులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించే గంగానదీ పుష్కరాలు ఈ నెల 22 నుంచి మే మూడో తేదీ వరకు కొనసాగనున్నాయి. పుష్కరాలు జరిగే తేదీలతోపాటు వాటికి అటూ ఇటూగా దాదాపు 2లక్షల మందికిపైగా భక్తులు కాశీ యాత్రకు వెళ్తారన్నది ఓ అంచనా. సాధారణ రోజుల్లోనే ఈ ఒక్క రైలు సరిపోక, రోడ్డు మార్గాన అంత దూరం వెళ్లలేక భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అలాంటిది పుష్కరాల వేళ, రద్దీ అంతకు పదిరెట్లు పెరుగుతున్నా అదనపు రైలు ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించలేకపోవటం గమనార్హం. భారీగా పెరిగిన విమాన చార్జీలు సాధారణ రోజుల్లో కాశీకి విమాన టికెట్ ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలుగా ఉండేది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ ధర పెంచుకునే డైనమిక్ ఫేర్ విధానాన్ని ఇప్పుడు విమానయాన సంస్థలు బాగా వినియోగించుకుంటున్నాయి. గంగా పుష్కరాలకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుండటంతో ఒక్కో టికెట్ ధరను రెట్టింపు చేసి విక్రయిస్తున్నాయి. కీలక రోజుల్లో అది మరింత ఎక్కువగా ఉంటోంది. అంత ధరను భరించే పరిస్థితి లేనివారు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ వైపే చేస్తున్నారు. ఆ క్లోన్ రైలును పునరుద్ధరించాలి కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగువారే ఎక్కువ. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కు. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో పనిచేస్తున్న బీహార్ వలస కూలీలు కూడా ఈ రైలు మీదే ఆధారపడుతుంటారు. దీంతో గతంలో ఈ రైలుకు అనుబంధంగా ఓ క్లోన్ రైలు నడిపేవారు. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో నడిచే మరో రైలు అన్నమాట. ముందు రైలుకుఉన్న ఫ్రీ సిగ్నల్ క్లియ రెన్స్ సమయంలోనే ఈ క్లోన్ రైలు నడుస్తుంది. కోవి డ్ ఆంక్షల సమయంలో రద్దయిన ఈ రైలును తిరిగి పునరుద్ధరించలేదు. అది రద్దీ మార్గం కావటం, దా నికి తగ్గ అదనపు లైన్లు లేకపోవటం, ఉన్న అవకాశాలను ఇతర జోన్లు వినియోగించుకుంటుండటమే దీనికి కారణమని స్థానిక రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రద్దయిన మన క్లోన్ రైలును వేరే రాష్ట్రం ఒత్తిడి తెచ్చి వినియోగించుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులతోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా రైల్వే బోర్డుపై ఒత్తిడితెచ్చి ఆ క్లోన్ రైలును పునరుద్ధరిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. -
ముగిసిన ‘పుష్కరం’.. భక్తజన పునీతం
కౌటాల(సిర్పూర్)/కోటపల్లి(చెన్నూర్)/కాళేశ్వరం: ప్రాణహిత నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు ఆదివారం పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఈనెల 13న ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇటు కుమురంభీం జిల్లా తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లితోపాటు అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ పుష్కరఘాట్లలో ఈ పన్నెండు రోజుల్లో దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించారు. అలాగే కాళేశ్వరాలయాన్ని 10 లక్షల మంది భక్తులు సందర్శించారు. ఆలయానికి వివిధ పూజలు, లడ్డూ ప్రసాదాల రూపేణా రూ.70లక్షల ఆదాయం సమకూరినట్లు అంచనా. కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పన్నెండు రోజులు పన్నెండు హారతులిచ్చారు. ఆదివారం తుమ్మిడిహెట్టి వద్ద 108 యజ్ఞకుండాతో శివసంకల్ప మహాయజ్ఞం నిర్వహించారు. కాశీ నుంచి వచ్చిన వేదపండితులు నదికి ముగింపు హారతినిచ్చారు. -
ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
‘ప్రాణహిత’కు పోటెత్తిన భక్తజనం
భూపాలపల్లి/కాళేశ్వరం/కోటపల్లి/వేమనపల్లి: ప్రాణహిత పుష్కరాలకు రెండోరోజు భక్తజనం పోటెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదీతీరం భక్తులతో కిటకిటలాడాయి. గురువారం సెలవు రోజు కూడా కావడంతో తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, కేరళ నుంచి భక్తులు తరలివచ్చారు. పుష్కర స్నానాలతోపాటు కాళేశ్వర ముక్తీశ్వరులను లక్షమంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లి, తుమ్మిడిహెట్టి పుష్కరఘాట్లలో రద్దీ కనిపించింది. కాగా, ప్రాణహిత పుష్కరాలకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసి, సౌకర్యాలు కల్పించడంతో మన రాష్ట్రం నుంచి భక్తులు మహారాష్ట్రలోని సిరొంచ, నగురం ఘాట్లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. మహారాష్ట్రలోని పుష్కరఘాట్లలో 2.5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. -
Pranahita Pushkaralu: పుష్కరాలు షురూ.. తరలిన భక్త జనం
సాక్షి, మంచిర్యాల/భూపాలపల్లి /కాళేశ్వరం: ప్రాణహిత పుష్కర సంబురం మొదలైంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వేమనపల్లి ఘాట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుష్కరాలను ప్రారంభించారు. వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, వైదిక క్రతువులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ వెంట.. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాణహిత నది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రవహించి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ మేరకు ప్రాణహిత నది వెంట పలుచోట్ల పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇతర రాష్ట్రాలవారు మంగళవారం సాయంత్రానికే ప్రాణహిత తీరాలకు చేరుకుని.. తాత్కాలిక గుడారాల్లో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత పుష్కరాలు మొదలవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. పిండ ప్రదానాలు, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. సమీపంలోని ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం నుంచి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరంలో దేవాదాయశాఖ అధికారులు, వేదపండితులు కాలినడకన కలశాలు, మంగళ వాయిద్యాలతో ప్రాణహిత నదికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.54 గంటలకు పడవలో నదికి అవతలివైపు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నదికి పంచ కలశాలతో ఆవాహనం చేసి.. పుష్కరుడి(ప్రాణహిత)కి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం పంచ కలశాలల్లో నీటిని తీసుకొచ్చి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివారికి అభిషేకం, పూజలను నిర్వహించారు. ఇక కాళేశ్వరానికి అనుకుని అవతలివైపు ఉన్న మహారాష్ట్ర పరిధిలోని సిరొంచలో ఆ రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని రెండు ఘాట్లలో తొలిరోజు 10 వేల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. ఇక్కడికి తొలిరోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా తరలివచ్చారని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు నదీ హారతి ఇచ్చారు. అర్జునగుట్ట వద్ద కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఇంద్రకరణ్‌రెడ్డి గోదావరి ఉప నదిగా మనకు ప్రాణహిత పుష్కలంగా నీరందిస్తోంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది సంతోషకరం. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు హరిస్తాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు అన్నిరకాల మేలు జరగాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ‘ప్రాణహిత’ ప్రత్యేక టూర్ ప్యాకేజీ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత పుష్కరాల కోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక యాత్ర ప్యాకేజీని బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వరకు ఈ నెల 24దాకా అంటే 12 రోజుల పాటు ఈ ప్రత్యేక యాత్ర నడుస్తుంది. రోజూ ఉదయం 05:00 బషీర్‌బాగ్ సీఆర్వో నుంచి బస్సు బయలుదేరుతుంది, 8:30 గంటలకు అల్పాహారం ఉంటుంది. 11:00 గంటల సమయంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 వరకు సిరోంచ పుష్కరఘాట్ వీక్షించేందుకు సమయమిస్తారు. తర్వాత గంటపాటు దర్శన సమయం, 1.45 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్లో భోజనం ఉంటాయి. 2.45 గంటలకు తిరుగు ప్రయాణమై రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ యాత్ర ఏసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,760, నాన్‌ఎసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా ఉంటాయని టీఎస్‌టీడీసీ ప్రకటించింది. -
ప్రాణహిత పుష్కర సంబరం
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాలకు నదీతీరం, త్రివేణి సంగమం సంసిద్ధమైంది. నదులకు 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నదికి బుధవారం నుంచి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తనున్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో నిర్వహించే ఈ పుష్కరాలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘాట్లను ఏర్పాటు చేశాయి. ఈనెల 24 వరకు జరిగే ఈ పుష్కరాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, మహారాష్ట్ర వైపు సిరోంచ, నగు రంలో ఈ ఘాట్లు ఉన్నాయి. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అర్జునగుట్ట వద్ద పుష్కరాలను ప్రారంభించనున్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద విధుల నిర్వహణ కోసం సుమారు ఆరువేల మంది పోలీసులు, ఇతర శా ఖల సిబ్బంది పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాణహిత జననం, పయనం: గోదావరి నదికి అతి పెద్ద ఉపనది ప్రాణహిత. పెన్‌గంగా, వార్దా నదిలో తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పురుడు పోసుకుంది. ఈ నది తుమ్మిడిహెట్టి నుంచి 113 కి.మీ. ప్రవహిస్తుంది. బెజ్జూర్ మండలం గూడెం, సోమిని, తలాయి, వేమనపల్లి మండలం రావులపల్లి, వేమనపల్లి, కలలపేట, ముల్కల్లపేట, రాచర్ల, వెంచపల్లి, కోటపల్లి మండలం జనగామ, నందరాంపల్లి, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల మీదుగా పయనిస్తుంది. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరి, ఇందారం, తోగుల వెంకటాపూర్ మీదుగా ప్రవహిస్తూ రేగుంట, కొత్తూర్, తేకడా, గిలాస్పేట, రాయిపేట, రంగాయపల్లి, హమురాజీ, సిరోంచ మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం (కాళేశ్వర ముక్తేశ్వరులుగా వెలిసిన పరమేశ్వరుడి పుణ్యక్షేత్రం) వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. పుష్కర ఘాట్లు ఇవే.. ►కాళేశ్వరం త్రివేణి సంగమం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా ►తుమ్మిడిహెట్టి– కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ►అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ►వేమనపల్లి – మంచిర్యాల జిల్లా మండల కేంద్రం ►సిరోంచ, నగురం – మహారాష్ట్ర ఇలా చేరుకోవచ్చు.. ►కాళేశ్వరం: హైదరాబాద్ నుంచి కాజీపేట, వరంగల్ వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నా యి. వరంగల్ నుంచి రోడ్డుమార్గన భూపా లపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. ►అర్జునగుట్ట: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి చెన్నూరు మీదుగా అర్జునగుట్ట ఘాట్‌కు చేరుకోవచ్చు. ►తుమ్మిడిహెట్టి: కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి ఘాట్‌కు వెళ్లాలంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల మీదుగా రైళ్లు కాగజ్‌నగర్ వరకు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిర్పూర్ టీ మీదుగా తుమ్మిడిహెట్టికి చేరుకోవచ్చు. ►వేమనపల్లి: నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాల నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల చేరుకుని అక్కడి నుంచి వేమనçపల్లికి వెళ్లవచ్చు. -
ప్రాణహిత పుష్కరాలకు వేళాయె..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రాణహిత పుష్కరాలను ఈనెల 13 నుంచి 24 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2010 తర్వాత ఈసారి స్వరాష్ట్రంలో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు 5 రోజులుగా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారి, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ఆదివారం కూడా పనులను పర్యవేక్షించారు. తెలంగాణ–మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు.. గడ్చిరోలి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ వద్ద.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సాధారణ ప్రజల కోసం ఒకటి, వీఐపీల కోసం మరొకటి ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ కాళేశ్వరంలో శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో భక్తులు 70 వేల నుంచి లక్ష వరకు కాళేశ్వరం చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా, పుష్కరాల సందర్భంగా కంచిపీఠం ఆధ్వర్యంలో కాళేశ్వరంలో నిర్వహించే పూజా కార్యక్రమాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కుటుంబ సభ్యులతో హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. పుష్కరాల ప్రారంభం రోజునే సీఎం కేసీఆర్ రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు. నిధుల విడుదలపై స్పష్టత కరువు.. 2010లో ప్రాణహిత పుష్కరాలకు అన్ని శాఖల నుంచి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసి ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సారి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. కలెక్టర్ భవేష్ మిశ్రా కలెక్టర్ కోటా కింద రూ.49 లక్షలు మంజూరు చేశారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి çఘాట్ల వద్ద తాత్కాలిక పనులు రూ.70 లక్షల అంచనాతో చేసేలా ఆ జిల్లా కలెక్టర్ భార తి హోళ్లికేరి అనుమతి ఇచ్చారు. ఈ నిధులతో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు మరుగు దొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఇతర పనులు చేపట్టాయి. పుష్కరాల ప్రారంభానికి రెండు రోజులే ఉండగా, నిధుల మంజూరుపై స్పష్టత లేక అధికార యంత్రాంగం అయోమయంలో ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి కాళేశ్వరంలో లాడ్జిలు, హోటళ్లు, ఇళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. -
పుష్కరాలకు వెళ్లి.. మృత్యుఒడికి చేరింది
సాక్షి,పాలకొండ రూరల్(శ్రీకాకుళం): శ్రీనగర్‌లో జరుగుతున్న సింధూ నది పుష్కరాలకు వెళ్లిన జిల్లా వాసి అక్కడ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. పాలకొండలోని దేవరపేటకు చెందిన వ్యాపారి బోగాది సీతయ్య, సతీమణి ఆదిలక్ష్మి (53) ఈ నెల 17న పుష్కర స్నానాల కోసం శ్రీనగర్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో బస ఏర్పాట్లు చేసుకున్న వీరు శనివారం దైవ దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరిగి ప్రయాణంలో భాగంగా బస చేస్తున్న హోటల్‌కు చురుకున్నారు. అదే రోజు రాత్రి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్డికి వెళ్లిన ఆదిలక్ష్మి మృతి చెందారు. ఈ విషయాన్ని సీతయ్య ఫోన్ ద్వారా పాలకొండలోని కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. -
పుష్కరాల వేళ కూల్చేసిన ఆలయాలన్నీ తిరిగి నిర్మించాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/నరసరావుపేట రూరల్ : పుష్కరాల సమయంలో కూల్చి వేసిన ఆలయాలన్నింటినీ తిరిగి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఇంద్రకీలాద్రి నుంచి ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కృష్ణానది తీరంలో కూల్చివేసిన ఆలయ ప్రాంతాలను, ప్రభుత్వం ఇటీవల నిర్మాణం చేపట్టిన నాలుగు ఆలయాలను వారు పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆలయాలు నేలమట్టమై, అంతర్వేది రథం దగ్ధమై, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమై చాలా కాలమైందన్నారు. అయినా ఈ ఘటనలకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత పోస్ట్‌లు ఒక వర్గానికే దక్కాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ మర్చిపోయారని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేదని విమర్శించారు. తిరోగమనంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని త్రికోటేశ్వరస్వామిని కోరుకున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. -
తుంగభద్ర నదిలో దీపాలతో భక్తుల సందడి
-
తుంగభద్ర పుష్కరాలు : సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌లో భక్తుల సందడి
-
తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్
-
నది స్నానాలకు అనుమతి లేదు: వెల్లంపల్లి
సాక్షి, కర్నూలు : తుంగభద్ర పుష్కరాలు రేపటి(నవంబర్ 20) నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే ఘాట్‌లోకి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్నానాలను నిషేదించిట్లు మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని మంత్రి గుర్తు చేశారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. -
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలు
-
తుంగభద్ర పుష్కరాలకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు(సెంట్రల్): తుంగభద్ర పుష్కరాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 20న కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌ను సందర్శిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పర్యటన సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సందర్శించే సంకల్‌భాగ్ (వీఐపీ) పుష్కర ఘాట్‌లోకి ఆయన పర్యటన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్పా ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం తిరిగి వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు. సమన్వయంతో పని చేయండి సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. మంగళవారం ఆయన సునయన ఆడిటోరియంలో ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జేసీలు ఎస్.రామసుందర్‌రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్‌తో కలిసి తుంగభద్ర పుష్కరాలపై సమీక్షించారు. పుష్కరాలకు సీఎం వస్తున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్ పనులన్నీ బుధవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో బి.పుల్లయ్య, కేఎంసీ కమిషనర్ డీకే బాలాజీ, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ డీకే బాలాజీతో కలిసి నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో హెలిప్యాడ్, సంకల్‌భాగ్ ఘాట్‌ను పరిశీలించారు. అలాగే బెటాలియన్ నుంచి కొత్తబస్టాండ్, బంగారు పేట, ఎస్టీబీసీ కళాశాల, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, నరసింగరావు పేట మీదుగా సంకల్‌భాగ్‌లోని పుష్కరఘాట్ వరకు సీఎం వెళ్లే దారిని చూశారు. సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి చేయనున్న పూజలకు సంబంధించిన ఏర్పాట్లు చూడాలని నగరపాలక కమిషనర్‌ను ఆదేశించారు. పర్యటన సాగేదిలా.. ఉదయం 11 గంటలు : తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు. 11.20 : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.30 : గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లుకు బయలుదేరుతారు. 12.30 : ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 12.40 –12.55 : ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట : ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి రోడ్డుమార్గాన సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌కు బయలు దేరుతారు. 1.10 : సంకల్‌భాగ్‌కు చేరుకుంటారు 1.10 – 1.50 : పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1.50– 2.00 : సంకల్‌భాగ్ నుంచి బయలుదేరి బెటాలియన్‌కు చేరుకుంటారు. 2.05– 2.20 : బెటాలియన్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.30 : ఓర్వకల్లు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు. -
స్నానాలొద్దు.. నీళ్లు చల్లుకుంటే చాలు
సాక్షి, అమరావతి: భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని కరోనా పరిస్థితుల్లోనూ తుంగభద్ర పుష్కరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా పుణ్య స్నానాలపై నియంత్రణ చర్యలు చేపట్టనుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర నదికి ఈ సారి పుష్కరాలు రానున్నాయి. ఇది కృష్ణా నదికి ఉప నది. కర్ణాటకలో అత్యధిక భాగం, మిగతా ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రవహిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల మీదుగా కృష్ణాలో కలుస్తుంది. పుష్కరాల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న 16 ప్రముఖ ఆలయాలలో రూ.కోటి ఖర్చుతో ఆధునికీకరణ, అలంకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ► పుష్కరాలలో భక్తుల పుణ్య స్నానాల నిర్వహణలో నియంత్రణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ అనంతరం దేశ వ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్స్పై ఇప్పటికీ ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ తుంగభద్ర పుష్కరాలపై ప్రత్యేక నిబంధనావళితో ఉత్తర్వులు జారీ చేసింది. ► ప్రత్యేక ఘాట్ల ఏర్పాటుకు తగిన చర్యలు చేపడుతూనే వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా భక్తులు పుష్కర రోజుల్లో ఇంటి వద్దనే స్నానాలు చేసి, నది వద్ద కేవలం పవిత్ర జలాలను నెత్తిన చల్లు కోవాలని (ప్రోక్షణ) విస్త్రత స్థాయిలో ప్రచారం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ► భక్తుల సెంటిమెంట్ దృష్ట్యా పితృ దేవతలకు పిండ ప్రదానం నిర్వహించడం వంటి కార్యక్రమాలను ఏకాంతంగా జరుపుకునేందుకు పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తారు. ► ఇందుకోసం 16 దేవాలయాల పరిధిలో ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు. 600 మంది పురోహితులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ► వైరస్ లక్షణాల భక్తులు ఎవరైనా దర్శనం కోసం వచ్చినట్టు గుర్తిస్తే, ఆ భక్తుడే స్వచ్ఛందంగా తిరిగి వెనక్కు వెళ్లేలా నచ్చ జెప్పాలని దేవదాయ శాఖ కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించింది. -
ఘనంగా తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, అమరావతి: ‘తుంగే పానీ.. గంగే స్నానే’ అన్నది ఆర్యోక్తి. గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం! అత్యంత ప్రాశస్త్యమున్న తుంగభద్ర నదీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే వారిసంఖ్యను ముందే అంచనా వేసి.. ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఏర్పాట్ల కోసం రూ.199.91 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం పనుల్ని నవంబర్ 16 నాటికి పూర్తిచేయాలని నిర్దేశించింది. నవంబర్ 20న ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాలు డిసెంబర్ 1న ముగుస్తాయి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఆ మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. వరద తగ్గగానే పుష్కర ఘాట్ల నిర్మాణం తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో 20 చోట్ల పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.91 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. పదిరోజుల్లో వరద తగ్గిన వెంటనే ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర ఘాట్లు, నదీ తీరప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యమున్న పురాతన ఆలయాలకు వెళ్లే రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, అవసరమైన చోట కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పనులకు ఆర్ అండ్ బీ శాఖ రూ.117 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ రూ.30 కోట్లు మంజూరు చేశాయి. కర్నూలు నగరంలోను, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు పట్టణాల్లోను పారిశుధ్యం, అంతర్గత రహదారులకు కొత్తరూపు ఇవ్వడానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. నిరంతరం మంత్రుల సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పుష్కరాల ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కార్మికశాఖ మంత్రి జయరాం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ నేతృత్వంలో 21 శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాట్ల కమిటీ ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్కర ఘాట్లతోపాటు జల్లు స్నానం చేసేందుకు షవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఘాట్ల సమీపంలో స్నానపుగదులు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పారిశుధ్యం పనుల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించనున్నారు. -
నవంబర్ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కరాలను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 దాకా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్‌కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం దిశానిర్దేశం చేశారు. విజయవాడలో 18 శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మంత్రులు ఏం చెప్పారంటే.. u పాత పుష్కర ఘాట్లకు అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలి. కొత్తగా నిర్మించే పుష్కర ఘాట్లను నాణ్యంగా, వేగంగా పూర్తి చేయాలి. భవిష్యత్‌లో వాటిని ఉపయోగించుకునేలా ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టాలి. పుష్కర ఘాట్ల పనులు నవంబర్ 1లోగా పూర్తి కావాలి. u రహదారుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.117.02 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలి. u స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి. తాగునీటి సరఫరా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. -
బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు..
పుష్కరాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకు తగినట్లుగానే గతంలో కృష్ణా, గోదావరి తదితర పుష్కరాలకు పర్యాటకులు పోటెత్తారు. ఇప్పుడు తాజాగా నవంబర్ 5 వ తేదీ నుంచి బ్రహ్మపుత్ర నది పుష్కరాలు ప్రారంభ మవుతున్నాయి. ఈ సమయంలో పుష్కర స్నానాల కోసం పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రత్యేక బ్రహ్మపుత్ర పుష్కరాల టూర్ ప్యాకేజీలు ప్రకటించారు. ఇందులో రెండు ప్యాకేజీలున్నాయి. 8 రోజుల టూర్ ప్యాకేజీ (రూ.14,500 ప్లస్ జీఎస్టీ)లో గౌహతి, షిల్లాంగ్ ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇక 11 రోజుల ప్యాకేజీ(రూ.17500 ప్లస్ జీఎస్టీ)లో గౌహతి, షిల్లాంగ్, కోల్కత్తా ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందులో భాగంగా కామఖ్య శక్తిపీఠం, శుక్లేశ్వర మందిరం, నవగ్రహ మందిరం, పికాక్ ఐలాండ్, డాన్‌బాస్కో మ్యూజియం, దక్షిణేశ్వర్ కాళీమాత మందిరం, హౌరా బ్రిడ్జి తదితర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తారు. వివరాలకు 8106201230, 7032666925నెంబర్లలో సంప్రదించవచ్చు. -
భీమా పుష్కరాలు ప్రారంభం
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలంలో వ్రహిహిస్తున్న భీమా నది పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యా యి. ఈ నది పుష్కరాల కోసం మూడు పుష్క ర ఘాట్లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.23 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛ రణల నడుమ పుష్కరుడికి మంగళ హారతి ఇచ్చి పుష్కరాలు ప్రారంభమైనట్లుగా ప్రకటిం చారు. నేరడగం పక్షిమాద్రి విరక్త మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహా స్వా మి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవదాయ శాఖ కమిషనర్ శ్రీనివాస్‌రావు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు పూజల తర్వాత నదీ స్నానం ఆచరించారు. -
నేటి నుంచి భీమా పుష్కరాలు
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలంలో ప్రవహిస్తున్న భీమా నది పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 22వ తేదీ వరకు కొనసాగే పుష్కరాలకు రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పుణ్యస్నానాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, తెలంగాణలో కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే భీమా నది ప్రవహిస్తోంది. ఈ పుష్కరాలను పురస్కరించుకుని తంగిడి, కుసునూర్, శుక్రలింగంపల్లి గ్రామాల్లో స్నాన ఘాట్లను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 7.24 గంటలకు అధికారులు, వేద పండితులు పుష్కరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా పుష్కరాలను ప్రారంభించనున్నారు. -
నీళ్ల బొట్టు లేదు..
జన్నారం : గోదావరిలో పుణ్యస్నానానికి నీటి కటకట ఏర్పడింది. జన్నారం మండల పరిధి నదీ తీరంలో మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానం ప్రయాసగా మారింది. పరమేశ..గంగను విడువుము అని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పక్కనున్న కడెం ప్రాజెక్టు నుంచి సైతం నీటి బొట్టు విడుదల లేదు. దీంతో మడుగుల్లోనే పుణ్యస్నానం చేయాల్సి వస్తుంది. జన్నారం మండలంలో కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్ గ్రామాలలో గోదావరి రేవులున్నాయి. ఇందులో కేవలం కలమడుగు గోదావరి రేవులో మాత్రమే ప్రస్తుతం నీళ్లున్నాయి. అవికూడా హస్తల మడుగులో ఎక్కువగా ఉన్నాయి. అయితే మడుగు ప్రాంతం అతి ప్రమాదకరం కాబట్టి భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం లేదు. మిగతా గోదావరి తీర ప్రాంతాలలో నీరు లేదు. గత సంవత్సరం ఆయా రేవులలో నీరు పుష్కలంగా ఉంది. దీంతో శివరాత్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కానీ ఈఏడాది స్నానాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కడెం ప్రాజెక్టు ఉన్నా.. గతంలో కూడా గోదావరి నదిలో నీరు లేని సమయంలో భక్తుల సౌకర్యం కోసం కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ఈసారి కడెంలోనూ సరిపడా నీరు లేకుండపోయింది. దీంతో నీటి విడుదల కుదరదని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు. కడెం పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 681 అడుగుల్లో నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిలోకి చుక్కా నీరు రావడం లేదు. జాగ్రత్త వహిస్తే మేలు.. మండలంలో కేవలం కలమడుగు గోదావరి నది రేవులో మాత్రమే నీరు ఉంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకే వచ్చే అవకాశముంది. ఇక్కడ కూడా హస్తల మడుగు(అత్తమడుగు) ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఈ మడుగులో సుమారు 20 మంది వరకు స్నానాల కోసమని వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈసారి శివరాత్రికి కూడా ఇదే ప్రాంతంలో ఎక్కువ మంది స్నానాలకు వచ్చే అవకాశం ఉంది. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి న అవసరం ఎంతైనా ఉంది. రాత్రి కడెం నీరు విడుదల.. శివరాత్రిని పురస్కరించుకుని స్నానాల కోసం గోదావరి నదీలోకి కడెం ప్రాజెక్టు నుంచి మూడువేల క్యూసెక్కుల నీటిని ఎస్ఈ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాత్రి విడుదల చేశారు. నేటి ఉదయం 12 గంటలకు గేట్లు బంద్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే కడెం నీరు విడుదల చేసినా జన్నారం మండలం వరకూ వచ్చే అవకాశాలు లేకపోవడం గమనార్హం. -
పుష్కర పార్కింగ్ స్థలాల్లో మెుక్కల పెంపకం
మఠంపల్లి : పుష్కరాల కోసం మండలంలోని మట్టపల్లి వద్ద 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో అధికారులు మెుక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం వర్ధాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సైట్ ఇన్చార్జి బి.మురళి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చింతలమ్మగూడెం ఫారెస్ట్ బీట్ పరిధిలో ఉన్న అటవీ భూమిలో పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో ఇటీవల 20 వేల గుంతలు తవ్వారు వీటిలో వేప, గానుగ, దిరిసిన, నారవేప, నెమలినార, సీమతంగేడు వంటి 12 వేల మెుక్కలు నాటినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి.మురళి తెలిపారు. -
పుష్కరాల్లో ప్రజాధనం దుబారా: నాగం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉంటే పుష్కరాల పేరుతో వందలాది కోట్లు దుబారాగా ఖర్చుచేశారని, నిధుల వినియోగంపై సమగ్రంగా విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు మూడోవిడత రుణమాఫీ నిధులు ఇప్పటివరకు అందలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసినా ఇప్పటివరకు వారి ఖాతాల్లో జమచేయలేదన్నారు. మంగళవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కోర్‌కమిటీ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రధాన చెరువులను నాలుగు ప్రాజెక్టుల నీళ్లద్వారా నింపాలని, రెయిన్ గన్స్ ఏర్పాటుచేసి రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధమైన పనులు మానుకొని ప్రజాసమస్యలపై దృష్టిసారించాలని హితవుపలికారు. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తిరంగాయాత్ర సెప్టెంబర్ 17వరకు కొనసాగుతుందన్నారు. సెప్టెంబర్ 3వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బైక్‌ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. జిల్లాకేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభకు కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారం అహైర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. జిల్లాల పునర్విభజన లోపభూయిష్టం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లాల పునర్విభజన పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 30 మండలాలున్న చోట మూడు జిల్లాలను ఏర్పాటుచేశారని, పాలమూరు జిల్లాలో మాత్రం 64 మండలాలు ఉండగా మూడుజిల్లాలను మాత్రమే ఏర్పాటు చేయడం సరికాదన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని శంషాబాద్‌లో కలపడం సరికాదన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లో ఉంచి నాలుగు జిల్లాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కల్వకుర్తి, కొడంగల్ నియోజకవర్గాలను రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిర్మించినా.. నిరుపయోగమే!
– రూ.13కోట్లతో 7ఘాట్లు – రూ.17కోట్లతో రహదారులు – 2చోట్ల మాత్రమే ఉపయోగం కృష్ణా పుష్కరాల్లో భాగంగా పెబ్బేరు మండలంలో మొత్తం ఏడు ఘాట్లు నిర్మించారు. ఇందులో కేవలం రెండు చోట్ల మాత్రమే యాత్రికులు అధిక సంఖ్యలో రాగలిగారు.. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆయా చోట్ల మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలు కల్పించారు.. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి. పెబ్బేరు : మండలంలోని రంగాపూర్ వీఐపీ ఘాట్ రూ.6.15కోట్లతో, మునగమాన్‌దిన్నె రూ.మూడు కోట్లు, తిప్పాయిపల్లి రూ.1.2కోట్లు, యాపర్ల రూ.96లక్షలు, బూడిదపాడు రూ.60లక్షలు, గుమ్మడం రూ.21 లక్షలు, రాంపూర్ ఘాట్ రూ.87లక్షలు ఇలా మొత్తం రూ.13కోట్లతో పుష్కరఘాట్లు నిర్మించారు. రూ.17కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలను అధికారులు కల్పించారు. అయితే పుష్కరాల ప్రారంభం నాటికి జూరాల వరదనీరు భారీగా రావడంతో కేవలం రంగాపూర్, రాంపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్ల వద్ద మాత్రమే భక్తులకు స్నానాలు చేసేందుకు వీలయింది. రెండు రోజుల తర్వాత నుంచి రాంపూర్ ఘాట్‌కు నీళ్లు లేకపోవడంతో చివరి వరకు లక్షలాది మంది భక్తులు రంగాపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్లకు వెళ్లి పుష్కరస్నానాలు ఆచరించారు. దీంతో బూడిదపాడు, యాపర్ల, తిప్పాయిపల్లి, గుమ్మడం, రాంపూర్ ఘాట్లు నిరుపయోగంగా మారాయి. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి. హైవే నుంచి రాంపూర్ ఘాట్‌కు వెళ్లే రోడ్డును పంచాయతీరాజ్ అధికారులు ఏకంగా అలైన్‌మెంట్‌నే మార్చేసి బీటీ స్థానంలో సీసీ మాత్రమే నిర్మించారు. అసంపూర్తిగా.. వీఐపీలకు వసతి కల్పించేందుకుగాను పెబ్బేరు పీజేపి అతిథి గహం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1.5కోట్లు విడుదల చేసింది. అందులోని గదులు, ఏసీలు, రంగులు, బెడ్లు తదితర పనులను మాత్రమే కాంట్రాక్టర్లు హడావుడిగా చేశారు. దీని ముందు టైల్స్, గార్డెన్, మరో నాలుగు ఏసీలు, ఎస్ఈ, ఈఈ క్వార్టర్ల మరమ్మతు, అంతర్గత బీటీరోడ్లు తదితర పనులను చేపట్టలేదు. ఇక చేసిన పనులను అసంపూర్తిగా, మిగిలినవి పుష్కరాల నాటికీ ప్రారంభించకపోవడం అధికారుల పర్యవేక్షణ తీరుకు అద్దం పడుతోంది.