రహానే హాఫ్ సెంచరీ, భారత్ 398/3
ఫతుల్లా : బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్య రహానే అర్ధశతకం చేశాడు. మూడో రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి 93 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. రహానే 64 బంతుల్లోనే 6 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. 2013లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఉపఖండం లోపల రహానేకిది తొలిటెస్ట్. గతంలో అతడు ఆసియా వెలుపల 13 టెస్టులు ఆడాడు. గత 12 నెలల వ్యవధిలో టెస్టుల్లో 1000 పరుగులు చేసిన ఏకైక భారత్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్. అతని తర్వాత కోహ్లీ 840 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ (144 నాటౌట్), రహానే (55 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కు మురళీ విజయ్‌తో అభేద్యమైన 283 పరుగులు జోడించాక ఓపెనర్శిఖర్ ధావన్(174) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్ షకీబ్ అల్ అసన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (6) పరుగులు చేసి షకీబ్ ఓవర్లనే ఔటయ్యాడు. దూకుడుగా ఆడే యత్నంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(14, 2 ఫోర్లు) జుబేర్ హుస్సెన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ రెండు వికెట్లు పడగొట్టగా, జుబేర్ హుస్సెన్ ఒక వికెట్ తీశాడు.