మత్స సంతోషికి స్వర్ణం
జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ మత్స సంతోషి స్వర్ణ పతకాన్ని సాధించింది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో సంతోషి మహిళల 53 కేజీల విభాగంలో 186 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచింది.
పురుషుల 56 కేజీల విభాగంలో కోరాడ రమణ 237 కేజీలు బరువెత్తి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. అంతర్ రాష్ట్ర విభాగంలో తెలంగాణ లిఫ్టర్ వై.శివ కుమార్ 56 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని నెగ్గాడు