వారణాసిలో 23 మందిపైగా అరెస్ట్
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన నేపథ్యంలో ఆందోళన చేసేందుకు సమాయత్తమవుతున్న 23పైగా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు రైల్వే ఎంప్లాయిస్ యూనియన్ కు చెందిన వారు. రైల్వేలోకి 100 శాతం ఎఫ్ఐడీలను అనుమతిస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు ఆందోళనకు సిద్దమయ్యారు.
ముందుజాగ్రత్తగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీని నల్లజెండాలు చూపించి నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్న 12 మంది యువకులు, ఆరుగురు బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఉన్నారు. సుపరిపాలన దినోత్సవంగా సందర్భంగా మోదీ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.