హీరో అయిన విలన్
సినిమా చాలా మందికి ప్రేమ, ఆశ, ఆసక్తి అన్నింటికి మించి దాన్ని నమ్ముకున్న వారికి జీవితం. ఇక్కడ స్వశక్తితో ఉన్నత శిఖరాలను అధిష్టించిన వారెందరో, ఇక నటనను నమ్ముకున్న వాళ్లు చాలా మంది కింద స్థాయి నుంచే మన్ననలు అందుకునే స్థాయికి ఎదిగా రు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి పలువురు ప్రతి నా యకుడి పాత్రల నుంచి నా యకుల స్థాయికి చేరి సాధిం చారు.అలాంటి వారి స్ఫూర్తి తో ఇక్కడ తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ కోవకు చెందిన నటుడిగా రాజ్‌భరత్‌ను చెప్పుకోవచ్చు. అందం, చక్కని పర్సనాలిటీ, మంచి రంగు ఒక హీరోకు కావలసిన అర్హతలన్నీ ఉన్నాయని సీనియర్ నటుడు శివకుమార్ చేతనే ప్రశంసలు, ఆశీస్సులు అందుకున్న ఈయన గొప్ప సినీ నేపథ్యం నుంచి వచ్చిన నటుడు. రాజ్‌భరత్ తండ్రి ప్రఖ్యాత దర్శక, నిర్మాత మల్లియం రాజ్‌గోపాల్. ఈయన దివంగత ప్రఖ్యాత నటుడు శివాజీగణేశన్, జెమినీగణేశన్,శివకుమార్ వంటి నటులతో పలు చిత్రాలు చేశారు. ఇప్పుడు రాజ్‌గోపాల్ వారసుడుగా రాజ్‌భరత్ నటనను వృత్తిగా ఎంచుకున్నారు.
శశి దర్శకత్వం వహించిన 555 చిత్రం ద్వారా ప్రతినాయకుడిగా చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన రాజ్‌భరత్ గ్రోత్ దినదినాభివృద్ధి చెందుతుందనే చెప్పాలి. మిష్కిన్ దర్శకత్వంలో ఓనాయుమ్ ఆటుకుట్టియుమ్ చిత్రంలో మెరుగైన విలనీయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.తదుపరి ప్రమోషన్‌గా ఆంధ్రామెస్ చిత్రంలో కథానాయకుడి అవతారం ఎత్తా రు. ఈ చిత్రం విడుదలకు ముందే నట్పధికారం 79 చి త్రంలో హీరోగా నటించారు.చాలా మంది విషయంలో జరిగినట్లుగానే రాజ్‌భరత్ హీరోగా నటించిన తొలి చి త్రం కంటే ముందుగా రెండో చిత్రం విడుదల కానుంది.
ఆయన నటించిన నట్పధికారం 79 చిత్రం ఈ నెల 11న తెరపైకి రానుంది.ఈ సందర్భంగా ఆయన్ని పలకరించగా నట్పధికారం చిత్రంలో నటించడం మంచి అనుభవం అన్నారు.ఇంకా చెప్పాలంటే రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడమే గొప్ప అవకాశంగా పేర్కోన్నారు.ఆయన ఇంతకు ముందు కన్నెదిరే తోండ్రినాళ్ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమేనని,అలాంటి స్నేహం ఇది వృత్తంగా మరో కోణంలో రూపొందిన చిత్రం నట్పధికారం 79 చిత్రం అని తెలిపారు.
ఈ చిత్రానికి సహయ దర్శకుడిగా ప్రారంభించి కథానాయకుడిగా నటించే వరకూ తన భాగం ఉందన్నారు.కారణం దర్శకుడు రవిచంద్రన్‌తో ఉన్న అనుబంధమేనని చెప్పారు.చిన్న ఎమోషన్‌తో కూడిన ఈ చిత్రం జనరంజకంగా ఉంటుందని తెలిపారు. నటి రేష్మీమీనన్, తేజస్విని కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించే అవకాశం ఉందా?అన్న ప్రశ్నకు అనువాదంగా కాదుగానీ రీమేక్ అయ్యే అవకాశం ఉందని బదులిచ్చారు.కారణం ఇది యూనివర్సల్ కన్టెంట్తో రూపొందిన కథా చిత్రం అని ఆయన తెలిపారు.రాజ్‌భరత్ నటించిన మరో చిత్రం జీరో కూడా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.