కొత్త జిల్లాలపై తొందరపాటు వద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : కొత్త జిల్లాలపై తొందరపాటు వద్దని టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని ఆరోపించారు. జిల్లాను విభజించే సందర్భంలో ఇతర జిల్లాలకు చెందిన మండలాలు, నియోజకర్గాలను ప్రస్తుత జిల్లాలో కలవకుండా చూడాలన్నారు. ప్రతి జిల్లాకు కష్ణా నదితీరం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాస్థాయి అధికారుల సంఖ్యను పెంచాలని, ఖాళీ పోస్టులను జనాభా నిష్పత్తితో సర్దుబాటు చేసి వెంటనే నియమించాలని కోరారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని, రాష్ట్ర, జిల్లా క్యాడర్లుగా 90శాతం స్థానిక, 10శాతం ఓపెన్ కోటా పద్ధతిలో నియమకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు రామకష్ణరావు, బాల్కిషన్, రాఘవాచారి, ర ఘురాంరెడ్డి, ఫారుక్‌హుస్సేన్, వెంకట్‌రెడ్డి, వీరబ్రహ్మాచారి, నారాయణగౌడ్, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.