ఐసీఎంఆర్ చీఫ్‌గా డా. రాజీవ్ బహల్ నియామకం
న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్‌గా డా. రాజీవ్ బహల్ నియమితులయ్యారు. ఈమేరకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీఎంఆర్ చీఫ్‌తో పాటు ఆరోగ్యశాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్‌లో జెనీవాలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారు.
చదవండి: (అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే!)