Rani Bagh
-
రాణిబాగ్‌లో ‘పెంగ్విన్ రెయిన్ డ్యాన్స్’
సాక్షి, ముంబై: నగరానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త. బైకల్లాలోని ప్రముఖ వీరమాత జిజియాబాయి ఉద్యాన్ (రాణిబాగ్)లో ‘పెంగ్విన్ రెయిన్ డ్యాన్స్’ తిలకించేందుకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఈ పెంగ్విన్ రెయిన్ డ్యాన్స్ చూడాలంటే విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కాని త్వరలో ముంబైలోని రాణిబాగ్‌లో కూడా ఇలాంటి డ్యాన్స్ తిలకిం చేందుకు నగర పాలక సంస్థ (బీఎంసీ) ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగం గా సాగుతున్నాయి. మొత్తం రూ.120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ముంబైకర్లతోపాటు దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకుల ను కూడా ఎంతో ఆకట్టుకోనుంది. అయితే ఈ ప్రాజెక్టు ప్రత్యక్షంగా అందుబాటులోకి రావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని బీఎంసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాణిబాగ్ ఉద్యానవనానికి మరమ్మతులు జరుగుతుండడంతో మూసి ఉంచా రు. అత్యాధునిక హంగులతో ఆధునిక పద్ధతిలో దీన్ని పునర్నిర్మించే పనులు చేపట్టారు. ఉద్యానవనంలో జంతువులు, పక్షులు, నేలపై పాకే ప్రాణులు లేకపోవడంతో దాదాపు బోనులన్నీ ఖాళీగా దర్శనమిచ్చేవి. దీంతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోసాగింది. మరమ్మతులు పూర్తికాగానే అనేక ప్రాణులను విదేశాల నుంచి దిగుమతి చేయనున్నా రు. అందులో భాగంగానే పెంగ్విన్ రెయిన్ డ్యాన్స్ కూడా నెలకొల్పాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీని నిర్వహణకు ఐదేళ్లకు రూ.20 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. హంబోల్డ్ జాతి పెంగ్విన్లను కొనుగోలుచేసే ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తికానుంది. ఆ తర్వాత వాటిని ముంబైకి తీసుకొస్తారని బీఎంసీ వర్గాలు తెలిపాయి. అవి చాలా సున్నితమైన ప్రాణులు కావడంతో వాటి ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యేకంగా ఒక వైద్య బృందాన్ని నియమించనున్నారు. అయితే వాటికి సంబంధించిన ఆహారం ముంబైలో కావల్సినంత లభించడంవల్ల భోజనానికి ఇబ్బందేమి ఉండదని భావిస్తున్నారు. మొన్నటి వరకు (మరమ్మతులు చేపట్టకముందు) ఉద్యానవనాన్ని తిలకించేందుకు వచ్చే పర్యాటకుల నుంచి నామమాత్రపు చార్జీ వసూలు చేసేవారు. పనులు పూర్తయిన తర్వాత టికెట్ ధర భారీగా పెరిగే సూచనలున్నాయి. -
పోలీసులే వ్యభిచార గృహ నిర్వాహకులు
సాక్షి, న్యూఢిల్లీ: పంటకు కంచె కాపలా, ఆ కంచే చేను మేస్తే... ఢిల్లీ రాణీబాగ్ ప్రాంతంలో అచ్చంగా ఇదే జరుగుతోంది. ఇద్దరు కానిస్టేబుళ్లు చాలా కాలంగా ఇక్కడ ఒక వ్యభిచార గృహన్ని అదురుబెదురు లేకుండా నడుపుతున్నారు. ఎట్టకేలకు వీరి పాపం పండి పోలీసులు చేసిన దాడిలో పట్టుపడ్డారు. వీరు కేవలం వ్యభిచార గృహ నిర్వహణలోనే కాకుండా, బెదిరించి డబ్బు వసూలు చేయడంలోనూ కీలకపాత్ర పోషించేవారని, ఓ వ్యక్తిని బెదిరించి రూ. మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని ఉన్నతాధికారులు తెలిపారు. అత్యాచారం కేసుకు సంబంధించి తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా ఉండేందుకు నగర పోలీసులు తనవద్ద నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రాజస్థాన్‌లోని ఝూంఝ్నూ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ మనోజ్‌కుమార్, మంగోల్‌పురి నివాసి, ఢిల్లీ క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తున్న పవన్‌కుమార్ ల మీద నిఘావేశారు. విచారణలో ఈ ఇద్దరు రాణీబాగ్ ప్రాంతంలో వ్యభిచార గృహన్ని నిర్వహిస్తున్నారని వెల్లడయింది. వీరి బెదిరింపుతో మూడు లక్షలు ముట్ట జెప్పిన వ్యక్తి ఈ విషయాన్ని క్రైం బ్రాంచ్ అదనపు పోలీసు కమిషనర్ రవీంద్ర యాదవ్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏసీపీ రవీంద్రయాదవ్ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. ఈ ప్రత్యేక బృందం చేసిన దాడిలో మహిళతో పాటు ఐదుగురు వ్యక్తులు పట్టుపడ్డారు. నిందితుల్లో ఇద్దరు భార్యాభర్తలని, ఒకరు హోమ్‌గార్డ్ అని, మరొకరు మంగోల్‌పురిలో కిరాణా దుకాణం నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. వీరు రాణీబాగ్‌లో నడుపుతున్న వ్యభిచార గృహనికి క్రైం బ్రాంచ్ పోలీసు కానిస్టేబుల్ పవన్, రాజస్థాన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సహకారం అందించారని విచారణ అధికారులు తెలిపారు. రాణీబాగ్ వ్యభిచార గృహనికి వచ్చే విటులను బెదిరించి ఈ కానిస్టేబుళ్లు డబ్బులు వసూలు చేసేవారని అన్నారు.