సాక్షి, ముంబై: నగరానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త. బైకల్లాలోని ప్రముఖ వీరమాత జిజియాబాయి ఉద్యాన్ (రాణిబాగ్)లో ‘పెంగ్విన్ రెయిన్ డ్యాన్స్’ తిలకించేందుకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఈ పెంగ్విన్ రెయిన్ డ్యాన్స్ చూడాలంటే విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కాని త్వరలో ముంబైలోని రాణిబాగ్‌లో కూడా ఇలాంటి డ్యాన్స్ తిలకిం చేందుకు నగర పాలక సంస్థ (బీఎంసీ) ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగం గా సాగుతున్నాయి. మొత్తం రూ.120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ముంబైకర్లతోపాటు దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకుల ను కూడా ఎంతో ఆకట్టుకోనుంది.
అయితే ఈ ప్రాజెక్టు ప్రత్యక్షంగా అందుబాటులోకి రావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని బీఎంసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాణిబాగ్ ఉద్యానవనానికి మరమ్మతులు జరుగుతుండడంతో మూసి ఉంచా రు. అత్యాధునిక హంగులతో ఆధునిక పద్ధతిలో దీన్ని పునర్నిర్మించే పనులు చేపట్టారు. ఉద్యానవనంలో జంతువులు, పక్షులు, నేలపై పాకే ప్రాణులు లేకపోవడంతో దాదాపు బోనులన్నీ ఖాళీగా దర్శనమిచ్చేవి. దీంతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోసాగింది. మరమ్మతులు పూర్తికాగానే అనేక ప్రాణులను విదేశాల నుంచి దిగుమతి చేయనున్నా రు. అందులో భాగంగానే పెంగ్విన్ రెయిన్ డ్యాన్స్ కూడా నెలకొల్పాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీని నిర్వహణకు ఐదేళ్లకు రూ.20 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.
హంబోల్డ్ జాతి పెంగ్విన్‌లను కొనుగోలుచేసే ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తికానుంది. ఆ తర్వాత వాటిని ముంబైకి తీసుకొస్తారని బీఎంసీ వర్గాలు తెలిపాయి. అవి చాలా సున్నితమైన ప్రాణులు కావడంతో వాటి ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యేకంగా ఒక వైద్య బృందాన్ని నియమించనున్నారు. అయితే వాటికి సంబంధించిన ఆహారం ముంబైలో కావల్సినంత లభించడంవల్ల భోజనానికి ఇబ్బందేమి ఉండదని భావిస్తున్నారు. మొన్నటి వరకు (మరమ్మతులు చేపట్టకముందు) ఉద్యానవనాన్ని తిలకించేందుకు వచ్చే పర్యాటకుల నుంచి నామమాత్రపు చార్జీ వసూలు చేసేవారు. పనులు పూర్తయిన తర్వాత టికెట్ ధర భారీగా పెరిగే సూచనలున్నాయి.
రాణిబాగ్‌లో ‘పెంగ్విన్ రెయిన్ డ్యాన్స్’
Published Sun, May 25 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement