Ration cards issued
-
35 రోజుల్లో 6 లక్షల బియ్యం కార్డులు
సాక్షి, అమరావతి : గత చంద్రబాబు సర్కారులో అర్హులైన వారికి రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీలు, మండల కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాల్సి వచ్చేది. అయినా సరే కొత్తగా రేషన్ కార్డు గానీ పెన్షన్ గానీ మంజూరు అయ్యేది కాదు. ఎక్కడైనా అరకొరగా మంజూరైనా లంచాలతో పాటు అప్పటి అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే దక్కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అర్హులైన లబ్ధిదారులకు ఉన్న ఊళ్లల్లోనే బియ్యం కార్డు, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డులను నిర్ణీత గడువులోగా ఎవరి సిఫార్సులు, లంచాలు లేకుండానే మంజూరు చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిబద్ధత, చిత్తశుద్ధేనని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. అర్హతే ప్రామాణికం ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు అంటే 35 రోజుల్లో 6,11,824 మందికి బియ్యం కార్డులు మంజూరు చేశారు. సీఎం నిర్ధారించిన పది రోజుల గడువులోగానే ఇవన్నీ మంజూరు చేశారు. ఇందులో పెళ్లిళ్లు అయ్యి కొత్త కాపురం పెట్టుకున్న వారికి కొత్తగా బియ్యం కార్డు మంజూరుతో పాటు ఎవరైనా కార్డులో కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చడం, లేదా కార్డులో నుంచి పేరును విడదీయడం వంటివి కూడా ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్నాక నిర్ణీత గడువులోగా 35 రోజుల్లో 99 శాతం మందికి బియ్యం కార్డులు అందాయి. వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వాటిని అందజేశారు. ఎలాంటి సిఫార్సులూ అక్కరలేదు 35 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన 78,372 మందికి కొత్తగా వైఎస్సార్ పెన్షన్ కానుక మంజూరు చేశారు. అర్హులైన 99 శాతం మందికి పది రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేశారు. గత సర్కారులో అర్హులు ఎవరైనా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ ఊరిలో ఎవరైనా మృతి చెందితేనే ఆ స్థానంలో కొత్త పెన్షన్ ఇచ్చే వారు. అది కూడా జన్మభూమి కమిటీ సిఫార్సులు మేరకు మంజూరు చేసేవారు. ఇప్పుడు అర్హత ఉంటే చాలు సంతృప్త స్థాయిలో ఎవరి సిఫార్సులు లేకుండా పెన్షన్ మంజూరు చేస్తున్నారు. 35 రోజుల్లో అర్హులైన 38,830 మందికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులను దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే మంజూరు చేశారు. గడువులోగా నూరు శాతం ఇవ్వడమే లక్ష్యం ప్రస్తుతం నిర్ణీత గడువులోగా అంటే పది రోజుల్లోనే పెన్షన్, బియ్యం కార్డులను 99 శాతం మందికి మంజూరు చేస్తున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ సంతృప్తి చెందడం లేదు. నూటికి నూరు శాతం మందికి నిర్ణీత గడువులోగా మంజూరు చేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గతంలో అర్హత ఉన్న వారికి కూడా సంవత్సరాల తరబడి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా అన్నీ మంజూరు చేస్తున్నాం. ఇందుకు ముఖ్యమంత్రి నిబద్ధత, చిత్తశుద్ధే కారణం. స్వయంగా ముఖ్యమంత్రే వీటిని పర్యవేక్షిస్తున్నారు. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి -
ఓటర్లు మాయం!
కనిపించని ఓటర్ల చిరునామాలు వాస్తవ లెక్కలపై అధికారుల ఆరా వివరాలు లేని వారికి నోటీసులు 15 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని సూచన లేదంటే జాబితా నుంచి తొలగింపు సిటీబ్యూరో: గ్రేటర్‌లోని ఓటర్ల సంఖ్యపై అయోమయం నెలకొంది. కాగితాలపై లెక్కలకు... వాస్తవానికి మధ్య భారీ తేడా ఉంటోంది. దీంతో అధికారులు అసలు లెక్క తేల్చే పనిలో పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 83.85 ల క్షలు. వారిలో 40.03 లక్షల మంది ప్రస్తుతం ‘మాయ’మయ్యారు. వారి పేర్లు జాబితాలో ఉన్నాయి. కానీ ఆధార్‌తో ఓటరు గుర్తింపు కార్డుల అనుసంధానం ప్రక్రియలో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లిన అధికారులకు చాలామంది వివరాలు దొరకలేదు. తమ చిరునామాల్లో లేకపోవడం.. ఇళ్లకు తాళం వేసి ఉండటం.. రెండు చోట్ల పేర్లు కలిగి ఉండటం.. మరణించడం వంటి కారణాలతో వీరి వివరాలు లభించలేదు. బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో రేషన్ లబ్ధిదారులపై సర్కారు నిర్లక్ష్యంతో గుదిబండ పడింది. సకాలంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఐదు నెలలుగా పేద కుటుంబాలు మీ సేవ లేదా ఆన్లైన్ కేంద్రానికి వెళ్లి రూ.10 సమర్పించు కొని డేటా స్లిప్ తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. మహానగరం పరిధిలో సుమారు 20.29 లక్షల కుటుంబాలకు ప్రతి నెలా తిప్పలు తప్పడం లేదు. దీంతో నిరుపేద కుటుంబాలపై ఇప్పటి వరకు సుమారు రూ.13.50 కోట్ల మేర అదనపు భారం పడడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. కొత్త కార్డులు ఆగస్టు తర్వాతే జారీ అయ్యే అవకాశాలుండటంతో అప్పటి వరకు ఇదే పరిస్థితి అని పౌరసరఫరా శాఖ అధికారులు స్పష్టం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నెలా కొత్త స్లిప్‌లు.. తెలంగాణ ప్రభుత్వం పాత రేషన్‌కార్డులు రద్దు చేసి ఆహార భద్రత కార్డుల పేరిటకొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి కూపన్లు ఇప్పటి వరకు జారీ చేయలేదు. కేవలం ఆన్లైన్ వెబ్సైట్లో మంజూరైన కార్డుల వివరాలను పొందు పర్చి చేతులు దులుపుకోవడంతో నిరుపేదలపై భార ం తప్పడం లేదు. ప్రతినెల ఆన్లైన్ ద్వారా డేటా స్లిప్ తీసుకొని సమర్పిస్తే తప్ప రేషన్ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ప్రతినెల జారీ చేస్తున్న డైనమిక్ కీ రిజిస్ట్రర్‌లో లబ్ధిదారుల వివరాలు ఉంటున్న డీలర్లు మాత్రం డేటా స్లిప్ తప్పని సరిగా సమర్పించాల్సిందేనని పేర్కొంటున్నారు. దాని ఆధారంగానే రేషన్ సరుకులు అందజేస్తున్నారు. ఆధార్ జిరాక్స్ తంటా.. కొత్తగా మంజూరైన కార్డు డేటా స్లిప్ తోపాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ జిరాక్స్‌లు సైతం రేషన్ సరుకులకు తప్పని సరిగా మారాయి. ప్రతినెల కుంటుంబ సభ్యులందరి ఆధార్ జిరాక్స్ అడుగుతుండటంతో అదనపు భారం తప్పడం లేదు. డైనమిక్ కీ రిజిస్ట్రర్‌లో ప్రతినెలా చేర్పులు, మార్పులు జరుగుతుండటంతో ఆధార్ తప్పని సరి అని డీలర్లు పేర్కొంటున్నారు. కొత్త కార్డులు జారీ అయ్యే వరకూ నిరుపేదల పై ఈ భారం తప్పేటట్లు లేదు. ఫలితంగా ఆన్లైన్ కేంద్రాలకు కాసుల పంట పండుతోంది.