అయ్యో నా తెలుగు తల్లీ...!
అందరమూ తెలుగువా ళ్లమే; చదువుకున్న ప్రతి ఇంటికీ ఒక ఇంగ్లిష్ నిఘం టువు ఉండేవుంటుంది; తెలుగు నిఘంటువు మా త్రం కనిపించదు. ‘‘మన పిల్లలకు అవసరమైంది ఇంగ్లిషే కదా; మనమేమో అమెరికాకు గుమాస్తాలను ఉత్పత్తి చేసే యంత్రాలమై ఉంటిమి! పేరుకు తెలు గోళ్లం గానీ, తెలుగు చదువుతో పూట గడుస్తుం దా?’’ అనేది కల్తీలేని అంతరంగం.
మంచి తెలుగు పుస్తకాన్ని మార్కెట్లో అమ్ముకో వాలంటే, వెయ్యికాపీలు వదిలించుకునేందుకు ఏడా దిపాటు ఎదురుచూడాలి. తెలుగు జాతి జనాభాది ఎనిమిది కోట్ల పైచిలుకు. అందులో చదువుకున్న వారి మోతాదు అరవైశాతం కంటే ఎక్కువే. పేరొ చ్చిన ఒకే ఒక రచనతో జీవితమంతా చీకూచింతా లేకుండా గడిచిపోయేది ఇంగ్లిష్ రచయితల జాత కం. మనబోటివాళ్లం కూడా ఖరీదును ఖాతరు చెయ్యకుండా కొనేవి ఇంగ్లిష్ పుస్తకాలేనాయె. తన రచన అందరూ చదవాలని కోరుకోవడమే తప్ప, కొట్టుకు వెళ్లి ఇతరుల పుస్తకం కొనే తెలుగు రచయితలే అరుదు.
తెలుగును ఉద్ధరించాలనే నాటకానికి బహు విశాలమైన రంగస్థలం ‘ప్రపంచ తెలుగు మహాసభలు’. ఆ జాతరలో వేది కను ఆక్రమించే పెద్దలను ఎన్నుకొనే ప్రాతి పదిక ఏమిటో నాలాటి వారికి బోధపడదు. వాళ్లందరూ తెలుగువాళ్లే కావచ్చు. కానీ వాళ్లకూ, తెలుగు విజ్ఞానానికీ వీసమెత్తు సాంగత్యం కనిపించదు. భాష అనేది మతా తీత వ్యవహారమనే ఇంగితమైనా లేకుండా వైదిక ప్రార్థనతో కార్యక్రమం మొదలవుతుంది.
ఆహ్వానితులందరి చేతుల్లో తెలుగులో అచ్చే సిన బ్రోచర్లు కనిపిస్తాయి. ఇవన్నీ నిర్వాహకులు ఉచి తంగా పంచే కాగితాలు. ఆవరణలో తెలుగు పుస్త కాల ఎగ్జిబిషన్లు ఏర్పాటయ్యే ఉంటాయి. ఐనా, వం ద రూపాయలు చేసే తెలుగు రచన ఏ చేతా కనిపిం చదు. హాజరయ్యే సభికులంతా దొరలూ, దొర సానులకు మల్లే ఖరీదైన కార్లలో దిగేవాళ్లే. వేల ఖరీదు చేసే కాలిజోళ్లతో నాలుగడుగులు హుందాగా నడిచేవాళ్లే. వేమనదో, సుమ తిదో ఒక పద్యం బట్టీ పట్టించిన చంటో ళ్లను వెంటదీసుకొచ్చే కుటుంబాలు కూడా కొన్నుంటాయి. ఆ పిల్లో, పిల్లోడో మైకు ముందు నిలబడి, వచ్చీరాని తెలుగులో కంఠస్థం చేసిన పద్యాన్ని వేదికమీద చీదేసి, చప్పట్ల మధ్యన కిందికి దిగి. సిగ్గుపడుతూ తల్లిదగ్గరికి పరుగులు తీస్తారు. తల్లితో ఆత్రంగా ‘హౌ డు యు ఫీలిట్ మామ్?’ అంటూ కాన్వెంట్ భాషలో అడుగుతారు. ‘సో నైస్’ అంటూ బుగ్గమీద చిటికేస్తుంది తల్లి. ‘హౌ డిడ్ డ్యాడీ ఫీల్?’ అనేది పిల్లల రెండో ప్రశ్న. ‘వెరి మచ్ ఇంప్రెస్డ్’ అనేది తల్లి జవాబు. ఆత్మీయ సంబంధా లను ‘అమ్మా’, ‘నాన్నా’ అనే పలుకులతో పిలిపిం చుకునేందుకు సిగ్గుపడే సభాసదులతో సాగే సంబ రాలకు తెలుగు తల్లి విస్తుపోతుంది. తన ముఖ మెట్లుంటుందో కడుపున పుట్టిన బిడ్డలకే తెలియని గొడ్రాలి రాత ఈ తల్లిది.
ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుంచి విడిపోవా లన్న కోరిక ఉదయించిన రోజుల్లో మన పెద్దలు నూరిపోసిన ఉగ్గు ‘తమిళ ద్వేషం.’ ఆ అవసరం గతించి అరవయ్యేళ్లు దాటిపోయినా కైపు మాత్రం మనకు దిగిపోలేదు. అందుకే తమిళనాడులో మాతృ భాషను కాపాడుకునేందుకు జరుగుతున్న కృషి మన కు ఎండమావి. బడి కావచ్చు. గుడి కావచ్చు. వాడ వలసిన భాష మాత్రం తమిళమొక్కటే ఉండాలన్నది ఆ జాతి పట్టుదల. మతమేదైనా ప్రార్థన తమిళం లోనే జరుగుతుందనేది మనం నమ్మలేని యథార్థం. పాఠశాలల్లో తమిళం తరువాతిదే ఇతర భాషల స్థాయి. పాలనకోసం జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలకు విధిగా నియమితమైన భాష తమిళం. జిల్లా కలెక్టరు స్థాయి ఆఫీసరైనా, ఇంట్లో తప్ప ఇతరత్రా మాట్లాడ వలసింది తమిళమే. ‘ఇంత నామోషీగా ఉంటారనే కదా అరవలను మనం అసహ్యించుకునేది’ అను కునే తృప్తి తెలుగు జాతి సౌభాగ్యం. పట్టుదలను రుద్రమదేవికీ, పౌరుషాన్ని బాలచంద్రునికీ, పాండి త్యాన్ని విజయనగరానికీ అప్పగించి, మనం నిశ్చిం తగా బతుకుతున్నాం.
ఎం.వి. రమణారెడ్డి
(వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు) మొబైల్: 94402 80655