ఫేస్బుక్లో ఇవీ ఉండాల్సింది..!
గూగుల్ వాళ్ల సోషల్నెట్వర్కింగ్ సైట్ ఆర్కుట్లో ఒక ఫీచర్ ఉండేది. మన ప్రొఫైల్‌ను చూసిన రీసెంట్ విజిటర్లు ఎవరో తెలుసుకోవచ్చు దాని ద్వారా. పేరు ద్వారా అకౌంట్‌ను సెర్చ్ చేసి, మన పేజ్‌లోకి వచ్చి, మన ఇష్టాల ఇష్టాలను పరిశీలించి వెళ్లిన వారెవరో చూడటానికి అవకాశం ఉండేది ఆర్కుట్లో. మనం లాగిన్ కాగానే ‘రీసెంట్ విజిటర్స్’ జాబితా ప్రత్యక్షం అయ్యేది. అయితే ఫేస్బుక్లో ఆ సదుపాయం లేదు.
మన ప్రొఫైల్‌ను చూసి వెళుతున్నదెవరో మనకు తెలీదు! సోషల్స్నేహాల్లో మన పేజ్‌ను చూసి వెళుతున్నది ఎవరో తెలుసుకోవడం నిజంగా ఒక చక్కటి ఫీలింగ్. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా తమ పేజ్‌ను తరచూ ఎవరెవరు చూస్తున్నారో చూడటం నిజంగా హ్యాపీనే కదా! అలాంటి హ్యాపీనెస్ ప్రస్తుతానికి ఫేస్బుక్లో లేదు. నెటిజన్లకు పట్టకుండా పోయిన ఆర్కుట్లో ఉన్నా ఉపయోగం లేదు.
ఆఫ్‌లైన్‌లో ఉండి ఆడుకోలేం...
జీమెయిల్లో ఒక సదుపాయం ఉంది. మనం అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఆఫ్‌లైన్ మోడ్‌లోకి వెళ్లొచ్చు. అలా ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉంటూ ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారో చూడవచ్చు. కానీ ఎఫ్బీలో మాత్రం మనం ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉండి అందరితోనూ ఆడుకోవడానికి అవకాశం లేదు!ఒక్కసారి ఆఫ్‌లైన్‌లోకి వెళితే ఆన్లైన్లో ఉన్నదెవరో అర్థం చేసుకోవడం కుదరదు! ఇంకా జీమెయిల్లో బిజీ మోడ్‌లో ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫేస్బుక్లో ఆ సదుపాయం లేదు. ఫేస్బుక్ సర్ఫింగ్‌లో మరింత మజా రావాలంటే ఇలాంటి ఫీచర్ల అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు నెటిజన్లు.
ఈ విషయంలో ఎఫ్బీ గ్రేట్...
ఫేస్బుక్లో ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు అవతలి వారు మనం పంపిన మెసేజ్‌ను చూశారా లేదా అనే విషయం అర్థమైపోతోంది. అవతలి వారు చాట్‌బాక్స్‌లో క్లిక్ చేయగానే ‘సీన్’ అంటూ ఒక టిక్ మార్క్ డిస్ప్లే అవుతుంది. అలా చూసిన వ్యక్తి మెసేజ్‌కు స్పందిస్తూ టైప్ చేయడం మొదలుపెడితే ఆ విషయం కూడా ఇవతల వారికి సులభంగా అర్థమైపోతోంది.
ఫేస్బుక్లో మాత్రమే ఉన్న సదుపాయం ఇది. అయితే జీమెయిల్లో చాట్ చేసేటప్పుడు ఈ అవకాశం లేదు. జీమెయిల్ లేదా అర్కుట్చాట్ బాక్స్‌లో అవతలి వారు స్పందిస్తే తప్ప మనం పంపిన మెసేజ్ వారు చూశారో లేదో తెలుసుకొనే అవకాశమే లేదు! ఇలాంటి సదుపాయాన్ని అందించడంతో ఫేస్‌బుక్‌కు మంచి మార్కులు పడతాయి. గూగుల్ ఇలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.