Replacement posts
-
వైద్యులు వచ్చేస్తున్నారు..
► పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖత ► జిల్లాలోని పీహెచ్‌సీల్లో 14 పోస్టులు ఖాళీ ► రిమ్స్ వైద్య కళాశాలలో అదే పరిస్థితి ► వైద్యుల భర్తీతో సేవలు మెరుగు ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో వైద్యుల కొరతతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్లతో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో సైతం వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్య సేవలు అందక రోగులు హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్తున్నారు. వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం వైద్యులను నియమించేందుకు ప్రక్రియ ప్రారంభించడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2118 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఈ పోస్టులు భర్తీ చేసేందుకు త్వరలో పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఫైల్‌పై సంతకం చేశారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వరి తివారికి పంపించారు. ఆయన సంతకం చేసి టీఎస్సీపీఎస్సీకి పంపిస్తారు. ఈ నేపథ్యంలో టీఎస్సీపీఎస్సీ నిర్ణయంతో త్వరలో ఈ పోస్టులకు భర్తీ కానున్నాయి. దీంతో జిల్లాలోని వైద్యుల పోస్టులతో పాటు, రిమ్స్ మెడికల్ కళాశాలలో సైతం పోస్టులకు మోక్షం కలగనుంది. జిల్లాలో అందని సేవలు.. జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని వైద్యశాఖలో ఖాళీల కొరత వేధిస్తోంది. వైద్యులతో పాటు, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు, మలేరియా, డెంగ్యు, రక్తహీనత వంటి వ్యాధులతో ప్రతి ఏడాది ఎంతో మంది చనిపోతున్నారు. వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేయకుండా జాప్యం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆదిలాబాద్‌లో 22 పీహెచ్‌సీల పరిధిలో మొత్తం 14 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యాధికారుల పోస్టులతో పాటు నర్సులు, ఏఎన్ ఎంలు, ఫిజియోథెరఫిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్ లు, ప్రజారోగ్య సహాయకులు, తదితర పోస్టులు సుమారు 100 వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చిన్నచిన్న విషయాలకు కూడా రిమ్స్‌కు రావడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యుల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో సిబ్బంది పోస్టులు కూడా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. రిమ్స్‌లోనూ అదే పరిస్థితి.. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో సైతం పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 125 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 65 ట్యూటర్లు, 150 సివిల్ సర్జన్ లు, 10 డెంటల్ సర్జన్ ల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ట్యూటర్లను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమ్స్‌లో 151 పోస్టులకు గాను ఇద్దరు ప్రొఫెసర్లు, 21 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 50 మంది ట్యూటర్లు సేవలందిస్తున్నారు. ఇంకా 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం భర్తీ ప్రక్రియ ప్రారంభించడంతో రిమ్స్‌లో ఖాళీలు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సేవలు మెరుగుపడుతాయి.. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేయడం వల్ల వైద్య సేవలు మరింత మెరుగుపడుతాయి. కొన్ని పీహెచ్‌సీల్లో రెండు వైద్య పోస్టులకు ఒక్కోటి మాత్రమే భర్తీ చేశారు. వాటితో పాటు మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర సిబ్బందిని సైతం నియమిస్తే బాగుటుంది. – సాధన, అడిషనల్ డీఎంహెచ్‌వో -
వచ్చే నెల 30లోగా నోటిఫికేషన్లు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ వెల్లడి సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 4,009 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 30లోగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయ్‌భాస్కర్ వెల్లడించారు. ఈ పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. బుధవారం విశాఖలో ఆయన మీడియా మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో ఇంకా భర్తీకి నోచుకోని పోస్టులను కూడా ఈసారి కలిపి భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, గతంలో జరిగిన జాప్యం వల్ల వయోపరిమితిని ఆరేళ్లకు సడలిస్తూ జారీ చేసిన జీవో సెప్టెంబర్ 30తో ముగుస్తుందన్నారు. అందువల్ల ఈలోగా ఇచ్చే నోటిఫికేషన్లకే 40 ఏళ్ల వయోపరిమితి వర్తిస్తుందని చెప్పారు. ఆన్లైన్ పరీక్షల వల్ల అవకతవకలకు ఆస్కారం ఉండదన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కోసం ఏపీ ఆన్‌లైన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. గ్రూప్-1, 2, 3 పోస్టులకు 50 వేల మందికి పైగా అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉన్నందున.. తొలుత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో అర్హత సాధించిన వారినే ఆన్లైన్ పరీక్షకు అనుమతిస్తామన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకో!
♦ వైవీయూలో 68 అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధం ♦ నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ♦ ప్రతిభకు పట్టం కట్టేలా చర్యలు తీసుకోవాలంటున్న నిరుద్యోగులు వైవీయూ : యోగి వేమన విశ్వవిద్యాలయానికి త్వరలో కొత్త అధ్యాపకులు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీని చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఇందులో భాగంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో 3 ప్రొఫెసర్లు, 18 అసోసియేట్ ప్రొఫెసర్లు, 47 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ నియామకాలను రెండు విడతలుగా చేపట్టనున్న నేపథ్యంలో తొలివిడత నియామక ప్రక్రియ రానున్న మూడు నెలల్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్య కార్యాలయంలో వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్లతో ఖాళీల భర్తీ, నియామక ప్రక్రియ విధానంపై సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియడంతో పాటు పూర్తి స్థాయి మార్గదర్శకాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బోధనేతర సిబ్బంది భర్తీ లేనట్టేనా? కడప శివారులో 2006లో విశ్వవిద్యాలయంగా ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ హయాంలో నియామక ప్రక్రియ శరవేగంగా సాగింది. ఇతర విశ్వవిద్యాలయాలతో పోల్చితే అధ్యాపక పోస్టులును బాగానే భర్తీ చేయగలిగారు. విశ్వవిద్యాలయానికి 33 ప్రొఫెసర్, 61 అసోసియేట్ ప్రొఫెసర్ , 109 అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమని అప్పట్లో గుర్తించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 14 మంది ఆచార్యులు, 12 మంది అసోసియేట్, 89 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. వాస్తవానికి ఇంకా చాలా విభాగాల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నా విద్యార్థుల నిష్పత్తి, లభ్యత తదితర అంశాల ఆధారంగా పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగానే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా 2012లో పలు విభాగాల్లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ పలువురు కోర్టును ఆశ్రయించడంతో అచార్యుల పోస్టులు మినహా మిగిలినివి నిలిచిపోయాయి. విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ సిబ్బందిది కీలకపాత్రే. వైవీయూలో నాన్ టీచింగ్ విభాగంలో 22 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది పని చేస్తున్నారు. 143 మంది టైంస్కేల్ కింద, 60 మంది అవుట్ సోర్సింగ్ విభాగం, మరో 51 మంది డైలీవేజస్ కింద పనిచేస్తున్నారు. నాన్ టీచింగ్ విభాగంలో 79 ఖాళీల భర్తీ గురించి పట్టించుకోలేదు. ప్రతిభకు పట్టం కట్టేరా..? విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల్లో తమవారిని నియమించుకునేందుకు అధికారంలో ఉన్న నాయకులు ప్రయత్నించడం పరిపాటి. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ర్టంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీటిలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, సానుభూతి పరులకు చోటు కల్పించింది. దీంతో నియామక ప్రక్రియ సజావుగా సాగుతుందా.. లేక సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తారా అన్న అనుమానం అందరిలో తలెత్తుతోంది. -
సిఫార్సులకే పెద్దపీట..
అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు విశాఖ డివిజన్లో 120 పోస్టులకు ఇంటర్వ్యూలు పాతిక పోస్టులకు ఒక్కొక్కరే హాజరు విశాఖపట్నం : భీమిలి, గాజువాక, విశాఖ అర్బన్ ప్రాజెక్టుల పరిధిలో 120 అంగనవాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీ కోసం గురువారం విశాఖ ఆర్డీఒ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏజెన్సీలో ఐటీడీఏ పీఒ, మైదాన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీలో ఐసీడీఎస్ పీడీ కన్వీనర్‌గా వ్యవహరిస్తుండగా, ప్రాజెక్టు సీడీపీఒ, డీఎంఅండ్హెచ్ఒలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉండేవారు. ఇటీవలే అంగన్వాడీ పోస్టుల భర్తీలో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యేల స్థానంలో ఆర్డీఒలకు చోటు కల్పించారు. నియామక కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఐటీడీఎ పీడీ విజయలక్ష్మి, విశాఖ ఆర్డీఒ వెంకటేశ్వర్లుతో పాటు ఆయా ప్రాజెక్టుల సీడీపీఒలు, అదనపు డీఎంఅండ్హెచ్ఒలు గురువారం జరిగిన ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. సుమారు పాతిక పోస్టుల వరకు ఒక్కో పోస్టుకు ఒక్కరే దరఖాస్తు చేయగా, కొన్ని పోస్టులకు ఇద్దరేసి, మరికొన్ని పోస్టులకు గరిష్టంగా ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రాజెక్టు పరిధి లో నియామక కమిటీల పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు చేపట్టారు. ఇంటర్వ్యూల ప్రక్రియను ఐసీడీఎస్ పీడీనిర్వహించగా, ఆర్డీఒ పర్యవేక్షించారు. పోస్టుకు ఒక్కో దరఖాస్తు మాత్రమే రావడం పట్ల అధికారులు సైతం విస్తుపోయారు. ఈ పోస్టుల వెనుక భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇద్దేరి చొప్పున హాజరైన చోట కూడా భారీగా చేతులు మారినట్టు తెలుస్తోంది. భీమిలి, రూరల్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో భారీగా అవకతవకలు జరిగి నట్టుగాఆరోపణలు గుప్పుమన్నాయి. కొన్నిపోస్టులకు వేలం పాటలు కూడా జరిగినట్టు సమాచారం. కమిటీల్లో స్థానం లేకున్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే ఇంటర్వ్యూలు జరుగు తున్నట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు తొలుత మూడురోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిం చినప్పటికీ చివరకు ఎమ్మెల్యేల ఒత్తిళ్ల మేరకు ఒకరోజులోనే ముగించేందుకు ఏర్పాట్లు చేశారు. 16, 17 తేదీల్లో అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్ల పరిధిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. -
తెలుగులోనూ ప్రశ్నపత్రం
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహిస్తున్న రాతపరీక్షల్లో జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాన్ని తెలుగులోనూ ఇస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పేపర్‌ను ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించినట్లు కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇంగ్లిష్‌లో ఇచ్చే ప్రశ్నపత్రానికి పక్కనే తెలుగు అనువాదం ఇస్తామన్నారు. జవాబులు రాసేప్పుడు తెలుగులోగానీ, ఇంగ్లిష్‌లోగానీ ప్రశ్నలను చూసి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, రెండింటిలో ఏదో ఒక దానిని అభ్యర్థులు ఎంచుకోవాలని సూచించారు. మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పేపర్ మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుందన్నారు. పరీక్షకు పక్కా ఏర్పాట్లు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లో 99 కేంద్రాల్లో నిర్వహించే ‘ఏఈఈ’ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు పార్వతీ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగానికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపడుతోందని, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్ష ఉంటుందని వివరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు మందుగానే చేరుకోవాలని, ఉదయం పరీక్షకు 8:30 నుంచి 9:15 గంటల మధ్యలోనే, మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 మధ్యలోనే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు 1,600 మంది ఇన్విజిలేటర్లు, 1,050 మంది సిబ్బంది, 250 మందిని అబ్జర్వర్లను, తనిఖీల కోసం 29 స్పెషల్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పరిపాలనా ట్రిబ్యునల్‌లో పిటిషన్ ఏఈఈ (సివిల్) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న జనరల్ స్టడీస్ పరీక్ష పత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి పరిపాలనా ట్రిబ్యునల్‌కు టీఎస్పీఎస్సీ నివేదించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రాంచందర్‌రావు ట్రిబ్యునల్‌కు హామీ ఇచ్చారు. ఏఈఈ పోస్టుల నోటిఫికేషన్లో జనరల్ స్టడీస్ పేపర్‌ను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో రాసుకోవచ్చని ప్రకటించిందని, తర్వాత ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్‌లోనే ఇవ్వాలని నిర్ణయించిందని.. ఇది సరికాదంటూ ఆదిలాబాద్‌కు చెందిన చైతన్య, మరికొందరు అభ్యర్థులు శుక్రవారం పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. టీఎస్పీఎస్సీ హామీ ఇవ్వడంతో పిటిషన్‌పై విచారణను ట్రిబ్యునల్ ముగించింది. -
కొలువులు ఖాళీ
కొత్త వారు చేరికెప్పుడో? ఖాళీ పోస్టుల భర్తీ అయ్యేదెన్నడో? ఇంఛార్జిలతో కుంటుపడుతున్న పాలన విశాఖపట్నం: వేళ కాని వేళ లో సర్కార్ బదిలీలు చేపట్టింది. పై రవీలతో కొంతమంది, అయిష్టం గా మరి కొంతమంది కదిలారు. కోరుకున్న పోస్టులను దక్కించుకున్నారు. తీరా దక్కించు కున్న సీట్లలో చేరేందుకు మాత్రం రోజులు కాదు..వారాలు గడిచి పోతు న్నాయి. దీంతో కీలక శాఖల్లో పాలన కుంటుపడుతోంది. జిల్లా పాలన యంత్రాం గానికి మూల స్తంభమైన జిల్లా రెవెన్యూఅధికారి(డీఆర్వో) పోస్టు ఖాళీ అయిపోయి నెలన్నర దాటి పోయింది.అప్పటి నుంచి జేసీ-2 డి.వెంకటరెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. తాజా బదిలీల్లో కడప జేసీ-2గా పనిచేస్తున్న సి.చంద్ర శేఖరరెడ్డిని ప్రభుత్వం ఇక్కడ నియమించింది. ఉత్తర్వులువెలువడి పదిరోజులు దాటి పోయినా నేటికీ ఆయన విధుల్లో చేర లేదు. ఆయన స్థానంలో నియమితులైన అధికారి కడప జేసీగా విధుల్లో చేరకపోవడంతో ఆ జిల్లా కలెక్టర్ ఆయనను రిలీవ్ చేయడం లేదంటున్నారు. కానీ రెవెన్యూలో మరో వాదన వినిపిస్తోంది. డీఆర్వోగా చంద్రశేఖరరెడ్డి నియామకాన్ని జిల్లాలో ఓ మంత్రి వ్యతిరే కిస్తున్నారని..తనకు అనుకూలంగా ఉండే అధికారిని తెచ్చుకునేందుకు ఇంకా ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. మరొక పక్క కీలకమైన అర్బన్ పౌరసరఫరాలశాఖకు కూడా ఆర్నెళ్లుగా నాధుడుల్లేని పరిస్థితి. ఇక్కడ పనిచేసిన రవితేజనాయక్ను తెలంగాణాకు పంపారు. రూరల్ డీఎస్ఒ జే.శాంతకుమారి ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా బదిలీల్లో ఈమె కూడా వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు సాగించారు.విజయనగరం జిల్లా డిఎస్వో నిర్మలాబాయిని అర్బన్ డీఎస్వోగా ఈ నెల 12న ప్రభుత్వం బదిలీ చేసింది. పదిరోజులు దాటినా ఈమె కూడా ఇక్కడ విధుల్లో చేరలేదు. కాగా మరో ఇద్దరు అధికారులు ఈ పోస్టు కోసం ప్రయత్నాలు సాగిస్తుండడం ఈ జాప్యానికి కారణమన్న వాదన వ్యక్తమవుతోంది. ఇక సోషల్ వెల్ఫేర్ డీడీగా ఎవరిని నియమించకుండానే ఇక్కడ పనిచేస్తున్న డివి రమణ మూర్తి విజయనగరం డీడీగా బదిలీ చేశారు. ఈయన ఇంకా రిలీవ్ కాలేదు. కనీసం వచ్చి ఏడాది కాకుండానే బదిలీకి గురైన రమణ మూర్తి ఇక్కడకొనసాగేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలియవచ్చింది. ఇక ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు తాజా బదిలీల్లోనైనా భర్తీఅవుతాయని ఆశించారు. కానీ జరగలేదు. బీసీకార్పొరేషన్ఈడీగా పనిచేస్తూ ఏసీబీవలలో చిక్కడంతో సస్పెండ్‌కు గురైన జీవన్ బాబు స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ప్రస్తుతం బీసీ వెల్ఫేర్ఆఫీసర్ నాగేశ్వర రావు దీనికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక డిప్యుటీట్రాన్స్పోర్టు కమిషనర్ (డీటీసీ)గా పని చేసిన కృష్ణయ్యను తెలంగాణాకు ఎటాచ్ చేసి రెండు నెలలుగా ఈపోస్టుఖాళీగా ఉంది. ఇటీవల రవాణాశాఖ అంతర్గత బదిలీలు జరుగుతు న్నప్పటికీ కీలకమైన డీటీసీ పోస్టు మాత్రం ఖాళీగానే ఉంది. ఐసీడీఎస్ పీడీగా వచ్చిన విజయలక్ష్మి విధుల్లోచేరి శిక్షణ పేరుతో ఢిల్లీ వెళ్లారు. ఇంకా తిరిగి విధుల్లోకి చేరలేదు. అటవీశాఖలో ఏపీ ఎఫ్డీసీ ఆర్ఎంతో పాటు అరకు సబ్ డివిజన్ డీఎఫ్‌వో పోస్టులు ఖాళీగాఉన్నాయి. సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వోగా విజయనగరం నుంచి బదిలీపై వచ్చిన సూర్యనారాయణ పడాల్ ఇంకా విధుల్లో చేరలేదు. సమాచారశాఖలో డీడీతో పాటు డీపీఆర్వో పోస్టులు ఏళ్లతరబడి ఖాళీగానే ఉన్నాయి. ఇక ఏళ్ల తరబడి జిల్లాలో పాతుకు పోయిన కొందరు తమపై బదిలీవేటుపడకుండా రాజకీయ పలుకుబడినంతా ఉపయోగించి చక్రం తిప్పుతున్నారు. రూ.లక్షలు కుమ్మరించి సీట్లు కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు. మరొక పక్క ఏళ్లతరబడి ఇక్కడే పనిచేసి ఇటీవలే బదిలీ అయిన జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి ఖాళీగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్ జాయింట్ డెరైక్టర్ పోస్టులోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
జీహెచ్ఎంసీకి కొత్తనీరు!
త్వరలో పలు ఖాళీల భర్తీ సిటీబ్యూరో రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లోకి కొత్త ఉద్యోగులు రానున్నారు. వేల రూ. కోట్ల నిధులున్నా, చేయాల్సిన పనులెన్నో ఉన్నా వాటిని పర్యవేక్షించేందుకు, నిర్వహించేందుకు తగినంతమంది అధికారులు, ఉద్యోగులు లేరు. దాంతో జీహెచ్ఎంసీలో పలు పనులు ఎక్కడివక్కడే కుంటుతున్నాయి. ఈ పరిస్థితి త్వరలో మారనుంది. తెలంగాణ ప్రభుత్వ తొలి ఉద్యోగ ప్రకటన వెలువడటంతో ఇక దశలవారీగా జీహెచ్ఎంసీలో పోస్టులు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వివిధ విభాగాల నుంచి అధికారులను డిప్యుటేషన్ మీద తీసుకుంటుంది. అలా వివిధ విభాగాల్లో వెరసి 843 డిప్యుటేషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో 300కు పైగా ఇంజినీర్ల పోస్టులు కూడా ఉన్నాయి. తొలివిడత భర్తీ కానున్న ఇంజినీర్ల పోస్టుల్లో దాదాపు వందమంది జీహెచ్ఎంసీకి వచ్చే వీలుందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో ఆయా బాధ్యతలు నిర్వహించేందుకు పబ్లిక్‌హెల్త్, డీటీసీపీ, టీఎస్పీడీసీఎల్, డెరైక్టరేట్ ఆఫ్ హెల్త్, హార్టికల్చర్, పోలీస్, పశుసంవర్థకశాఖ, ఆడిట్, అగ్నిమాపక శాఖ, సమాచార, పౌరసంబంధాల శాఖ, న్యాయవిభాగం, గణాంక.. తదితర విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద తీసుకుంటారు. ఆయా ప్రభుత్వ విభాగాల్లో త్వరలో భర్తీ కానున్న పోస్టుల్లో నియమితులయ్యేవారు గణనీయసంఖ్యలో జీహెచ్ఎంసీకి వచ్చే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీ అవసరాల దృష్ట్యా 2607 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉందని ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడే ప్రసాదరావు కమిటీ సిఫార్సు చేసింది. అందులో 1300 పోస్టుల్ని తొలిదశలో భర్తీచేసేందుకు అప్పటి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటు.. తదితర పరిణామాల నేపథ్యంలో అవి భర్తీ కాకుండా పెండింగ్‌లో పడ్డాయి. ఇదిలా ఉండగా, గ్రేటర్లో పెద్దఎత్తున చేపట్టనున్న గృహనిర్మాణ కార్యక్రమానికి ఇంజినీరింగ్ విభాగానికి 390 మంది టెక్నికల్ అధికారులు అవసరమని కోరారు. తొలి నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్న ఇంజినీర్లలో దాదాపు వందమంది జీహెచ్ఎంసీకి వచ్చే వీలుందని చెబుతున్నారు. బీపీఎస్ అమలుకు 50 మంది టౌన్‌ప్లానింగ్ అధికారులు.. భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు..త్వరలోనే అమల్లోకి రానున్న బీపీఎస్‌ను అమలు చేసేందుకు కనీసం 50 మంది టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా కావాలని కోరారు.స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం అమలు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 18 మంది అధికారులను జీహెచ్ఎంసీకి పంపించాలని కోరారు. ఇలా వివిధ విభాగాలు, అంశాల వారీగా దాదాపు 1500 మంది అధికారులను ప్రథమప్రాధాన్యతగా భర్తీ చేయాల్సిన అవసరముందని జీహెచ్ంఎసీ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. -
దద్దరిల్లిన కలెక్టరేట్
మహారాణిపేట : వరుస ధర్నాలతో కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఏపీ స్టేట్ ప్రభుత్వ కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఫెడరేషన్.. అనకాపల్లి, మునగపాక మండలాల్లో నిర్మించ తలపెట్టిన లాజిస్టిక్ పార్క్‌ను విరమించుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ.. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలపై విచారణ జరిపించాలని ఏపీ స్టేట్ ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ ఏపీ స్టేట్ కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 3 లక్షల మంది కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఐదేళ్లుగా ఒక్క రూపాయి జీతం పెంచలేదని వాపోయారు. ఇచ్చిన జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచడమే కాకుండా రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, నగర కన్వీనర్ ఎస్.ఇందీవర, రాష్ట్ర నాయకులు వి.రాంప్రసాద్, కె.ఈశ్వరరావు, ఎస్.అమీర్, ఎన్.కిశోర్‌కుమార్ పాల్గొన్నారు. లాజిస్టిక్ పార్క్‌ను రద్దుచేయాలి అనకాపల్లి, మునగపాక మండలాల్లో 500 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన లాజిస్టిక్ పార్క్‌ను విరమించుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టి.సిరసపల్లి, వెంకటాపురం, రామారాయుడుపేట, తానాం, తదితర ప్రాంతాలకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. 40 ఏళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూముల్లో పార్కులు కడతారా? అని ప్రశ్నించారు. మీ సోకులకు మా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ధర్నాలో వెంకటాపురం సర్పంచ్ సుందరపు కనక అప్పారావు, సీఐటీయూ నాయకలు గనిశెట్టి సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోస్టుల భర్తీలో అవకతవకలపై విచారణ చేపట్టాలి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరుతూ నిరుద్యోగ వికలాంగుల జేఏసీ ధర్నా చేపట్టింది. జిల్లాలో 52 బ్యాక్లాగ్ ఉద్యోగాల (వికలాంగులు) భర్తీకి మార్చి 14న ఇచ్చిన నోటిఫికేషన్లో దొర్లిన తప్పులను సవరించాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోస్టుల భర్తీలో కాసులకు కక్కుర్తిపడి జీవో 31, 104ను కూడా వికలాంగుల సంక్షేమశాఖాధికారులు తుంగలో తొక్కారన్నారు. కార్యక్రమంలో వికలాంగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు డేవిడ్‌రాజు, ఎన్పీఆర్డీ అధ్యక్షుడు రాంబాబు, డీవైఎఫ్ఐ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏఏఈవోల భర్తీపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో) పోస్టుల భర్తీపై నీలినీడలు అలుముకున్నాయి. ఆదర్శ రైతు వ్యవస్థ స్థానే 4,442 ఏఏఈవోలను నియమించేందుకు ఆరు నెలల కిందటే ప్రక్రియ మొదలుపెట్టిన సర్కారు దీనిపై చేతులెత్తేసింది. ముందుగా 2 వేల పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించినప్పటికీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 15 వేల పోస్టుల భర్తీల్లో వీటిని చేర్చకపోవడంపై నిరుద్యోగ యువకులు ఆందోళన చెందుతున్నారు. పోస్టుల భర్తీ, సర్వీసు రూల్స్, అర్హత వంటి నిబంధనలను ‘ఏఏఈవో నియామకపు కమిటీ’ ప్రభుత్వానికి పంపింది. ఏ జిల్లాలో ఎంతమందిని నియమించాలన్న అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొంది. ఈ పక్రియ పూర్తయి నెలలు దాటినా ప్రభుత్వం వీటి భర్తీపై ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యానవనశాఖ గ్రీన్హౌస్, సూక్ష్మసేద్యం వంటి కీలకమైన కార్యక్రమాలు చేపడుతుండడం, ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసిన నేపథ్యంలో తక్షణమే ఏఏఈవోలను నియమించాలనుకున్నారు. సర్వీస్ రూల్స్ ప్రతిపాదించిన తర్వాత గత డిసెంబర్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ సర్కారు మాత్రం ఇప్పటివరకు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆదర్శ రైతులు లేక, ఏఏఈవోలు రాక అన్నదాతలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అవస్థలు పడుతున్నారు. తక్షణమే నింపాలి: నిరుద్యోగ అభ్యర్థులు ఏఏఈవో పోస్టులను తక్షణమే నింపాలని తెలంగాణ వ్యవసాయ ఉద్యాన డిప్లొమా నిరుద్యోగ అభ్యర్థులు బాలస్వామి, ఎల్లయ్య, కరుణాకర్, కుమారస్వామి, గోపి, మధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు తాము వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధికి బుధవారం విజ్ఞప్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. -
‘హైదరాబాద్-రంగారెడ్డిలకు ప్రత్యేక జోన్ ’ అవసరం
ఉద్యోగాలు, ప్రమోషన్లలో స్థానికులకు అన్యాయం: సబిత ముఖ్యమంత్రికి లేఖ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానికుల హక్కులను పరిరక్షించేలా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ‘ప్రత్యేక ఎంప్లాయీమెంట్ జోన్’ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి సబి తారెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో జంటజిల్లాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్‌కు ఆమె లేఖ రాశారు. రెండు జిల్లాల్లోని డిప్యూటేషన్లను రద్దు చేసి దొడ్డిదారిన వచ్చిన వారిని సొంత జిల్లాలకు పంపాలని డిమాండ్ చేశారు. ఫోకల్ (ప్రయార్టీ) పోస్టుల భర్తీలతో లోకల్ ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వాలని, జంటజిల్లాలో ఖాళీల భర్తీలోనూ స్థానికులనే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రత్యేకరాష్ట్రంలో అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన నిరుద్యోగుల ఆశలు వమ్ము చేయొద్దని కోరారు. -
జేసీజే పోస్టుల భర్తీ కొనసాగిస్తాం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం నిలిచిపోయిన ప్రక్రియను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొనసాగిస్తామని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ గడువు పొడిగించాలన్న తమ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో కోర్టు ధిక్కారం అవుతుందని పేర్కొంది. అందువల్ల 2014, 2015 నోటిఫికేషన్ల ఆధారంగా జరిగిన జేసీజే రెండు స్క్రీనింగ్ టెస్ట్‌లకు సంబంధించిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయడంతోపాటు రాతపరీక్ష, ఇంటర్వ్యూల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది. అవసరమైన పక్షంలో ఇంటర్వ్యూల వరకే ప్రక్రియను పూర్తి చేసి ఇందుకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉండేలా చూస్తామని వివరించింది. దీనిపై బుధవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. అంతకుముందు దీనిపై ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె. రామకృష్ణారెడ్డి అభిప్రాయం కోరగా ఈ ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జేసీజే పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు. గతేడాది జూన్ 2 నుంచి తెలంగాణ జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్ అమల్లోకి వచ్చాయని, దీని ప్రకారమే పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా హైకోర్టు, 2014, 2015లలో ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారమే జేసీజే పరీక్షలు నిర్వహించిందని, ఈ పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించబోదని ఏజీ చెప్పారు. అధికరణ 233, 234 ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నియామకపు ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. హైకోర్టు కేవలం నియామకపు ప్రక్రియను పర్యవేక్షించే ఏజెన్సీ మాత్రమేనని, కాబట్టి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్ ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. కింది స్థాయి న్యాయవ్యవస్థను విభజించేంత వరకు న్యాయాధికారుల పోస్టులను భర్తీ చేయవద్దని, జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లను కొట్టేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ఇటీవల విచారించిన హైకోర్టు ధర్మాసనం... జేసీజే పరీక్ష నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా సీల్డ్కవర్లో భద్రపరచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు రాగా ప్రధాన వ్యాజ్యాలను ఇప్పుడు విచారించడం సాధ్యం కాదని, అనుబంధ పిటిషన్లపై విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. -
మరో 55 వెటర్నరీ సీట్లు ఇవ్వండి
కేంద్ర వెటర్నరీ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి రాష్ట్రంలో తనిఖీలు చేసిన కౌన్సిల్ అధికారులు వెటర్నరీ కాలేజీల్లో 70 పోస్టుల భర్తీకి ఆమోదం హైదరాబాద్: రాష్ట్రానికి అదనంగా 55 బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ) సీట్లను మంజూరు చేయాలని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ)కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రెండు రోజుల కింద ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వీసీఐ ప్రతినిధి బృందం.. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కాలేజీ, కరీంనగర్ జిల్లా కోరుట్ల వెటర్నరీ కాలేజీల్లో మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా వీసీఐ బృందంతో రాష్ట్ర పశు సంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ సమావేశమయ్యారు. కోరుట్ల కాలేజీలో ఇప్పటికే 60 సీట్లు ఉన్నాయని, అదనంగా 15 సీట్లు కావాలని విన్నవించారు. అలాగే హైదరాబాద్‌లోని 60 సీట్లకు అదనంగా మరో 40 సీట్లు ఇవ్వాలని కోరారు. దీనిపై వీసీఐ బృందం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ రెండు కాలేజీల్లో అదనపు సీట్లను కోరిన నేపథ్యంలో.. ఆ మేరకు 70 మంది బోధనా సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ దీనిపై సీఎంకు ప్రతిపాదించినట్లు సమాచారం. కోరుట్ల కాలేజీలో అవసరం మేరకు సిబ్బంది ఉన్నారు. కానీ హైదరాబాద్ వెటర్నరీ కాలేజీలో మాత్రం 13 మంది బోధనా సిబ్బంది కొరత ఉందని వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.కొండల్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపడితే సరిపోతుందని, ఈలోగా అవసరాన్ని బట్టి డెప్యుటేషన్‌పై పశుసంవర్థక శాఖ నుంచి కొందరిని తీసుకోవాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ మేరకు వీసీఐకి హామీ ఇచ్చామని, అదనంగా 55 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నిమ్స్‌లో పోస్టుల భర్తీపై వివాదం!
- ఎయిమ్స్ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు - వైద్యుల నియామకాలపై ఫ్యాకల్టీ అసోసియేషన్ అభ్యంతరం సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో రూల్స్‌కు విరుద్ధంగా పోస్టుల భర్తీ చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతోంది. అర్హులకు పదోన్నతులు కల్పించకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా నిమ్స్ నిబంధనలను సడలించి ఖాళీ పోస్టులు భర్తీ చేయడం ఏమిటని ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రశ్నిస్తుంది. ఆస్పత్రిలో ప్రస్తుతం 30 డిపార్ట్మెంట్స్ ఉండగా, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అడిషినల్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ కేడర్‌లో 175 మంది పని చేస్తున్నారు. మరో 60-70 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేని కారణంగా కార్డియాలజీ, రుమటాలజీ, ఆంకాలజీ విభాగాల్లోని సీట్లను ఎంసీఐ రెండేళ్ల క్రితం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి చేజారిపోయిన సీట్లను మళ్లీ తెచ్చుకో వాలని నిమ్స్ యాజమాన్యం భావించింది. ఆ మేరకు రుమటాలజీ, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు భర్తీకి, కార్డియాలజీ, ఆంకాలజీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఎయిమ్స్ నిబంధనల మేరకు ఫ్యాకల్టీ భర్తీ జరిగేది. ఖాళీ పోస్టుల భర్తీకి తాము వ్యతిరేకం కాదు. ఖాళీలను భర్తీ చేయాల్సిందే. కానీ ఇష్టానుసారం నిబంధనలను మార్చడంపైనే మా అభ్యంతరమని ఫ్యాకల్టీ అసోసియేషన్ స్పష్టం చేస్తుంది. సీనియార్టీ కోల్పోతాం:ఫ్యాకల్టీ అసోసియేషన్ ఉస్మానియా, గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలతో పోలిస్టే నిమ్స్ కొంత భిన్నమైంది. గాంధీ, ఉస్మానియాలు పూర్తిగా ప్రభుత్వ సం స్థలైతే నిమ్స్ మాత్రం స్వయం ప్రతిపత్తి కలిగినది. డెరైక్టర్ ఎంపిక, వైద్యులు, ఇతర సిబ్బంది భర్తీ, ఆస్పత్రి నిర్వహణ, వైద్యసేవలు అందించే అంశంపై ఎయిమ్స్‌కు దీటుగా ప్రత్యేక గైడ్‌లైన్స్‌ను రూపొందించారు. గాంధీ, ఉస్మానియా ఫ్యాకల్టీలో మూడంచల వ్యవస్థ(అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్) కేడర్ ఉండగా, నిమ్స్‌లో ఇందుకు భిన్నంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అ సోసియేట్ ప్రొఫెసర్, అడిషినల్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అనే నాలుగు అంచల వ్యవస్థ ఉంది. ఇప్పటి వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అయిన వ్యక్తి ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకోవాలంటే కనీసం 12 ఏళ్లు పట్టేది. తాజాగా అడిషినల్ ప్రొఫెసర్ కేడర్‌ను రద్దు చేసి మూడంచల పద్ధతిపై ఖాళీలు భర్తీ చేయడంతో ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ కేడర్‌లో జాయిన్ అయిన వ్యక్తి ఐదేళ్లలోనే ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఏళ్ల తరబడి పదోన్నతులు కల్పించక పోవడంతో చాలా మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ కే డర్‌కే పరిమితమయ్యారు. తాజా సడలింపు వల్ల వీరంతా తమ సీనియార్టీని నష్టపోయే ప్రమాదం ఉందని నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ వాదిస్తుండగా, నిమ్స్ యాజమాన్యం మాత్రం తాము ఎంసీఐ నిబంధనల మేరకే పోస్టుల భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తుంది. నేడు ఇంటర్వూలు.. నిమ్స్‌లోని రుమటాలజీ, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు భర్తీకి, కార్డియాలజీ, ఆంకాలజీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. -
ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అనుమతించాలి
-
ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అనుమతించాలి
ముఖ్యమంత్రికి, కేంద్ర మానవ వనరుల మంత్రికి జగన్ వినతి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీ కోసం త్వరలో జరగనున్న డీఎస్సీ-2014 పరీక్షల్లో బీఈడీ అభ్యర్థులను అనుమతించాలని, ఆ మేరకు నిబంధనలు సవరించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుకు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గత నెల 30న ఒక లేఖ రాశారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రికి మరో లేఖ రాశారు. 2009 విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి 2010లో కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను పేర్కొన్న నిర్దేశిత సూత్రాలను సవరించాలని జగన్ కోరారు. రాష్ట్రంలో 2 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉండగా.. స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎస్జీటీ పోస్టుల భర్తీకి జరిగే పరీక్షల్లో పాల్గొనడానికి బీఈడీ పట్టభద్రులను అనర్హులుగా చేయడం వల్ల వారు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని జగన్ తన లేఖల్లో పేర్కొన్నారు. ఎన్సీటీఈ జారీ చేసిన నిబంధనల్లో బీఈడీ పట్టభద్రులు కేవలం 6 నుంచి 8 తరగతులకు మాత్రమే బోధించాలని పేర్కొన్నారన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నందున, బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించేలా మినహాయింపును కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్ సీఎంను కోరారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీఈడీ పట్టభద్రులు కూడా ఎస్జీటీ పోస్టులకు పరీక్షలు రాసుకునే అవకాశం ఉండేదని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీఈడీ పట్టభద్రులకు ఎస్జీటీ పోస్టులకు పరీక్షలు రాసుకునేలా అర్హతను సాధిస్తూ కేంద్రం నుంచి అనుమతి పొందిన విషయాన్ని తన లేఖల్లో పేర్కొన్నారు. వెంటనే కేంద్రానికి ఈ విషయమై విజ్ఞప్తి చేసి అనుమతి సాధించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు.. తమ రాష్ట్రం వినతిని సానుకూలంగా పరిశీలించి మినహాయింపు నివ్వాలని కేంద్రమంత్రిని జగన్ కోరారు. పత్తికొండకు నేడు జగన్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండకు వెళుతున్నారు. ఉదయం హైదరాబాద్‌లో బయల్దేరి తొలుత గాజులదిన్నె ప్రాజెక్టు పంప్‌హౌస్‌కు చేరుకుని, పనులను పరిశీలించి స్థానిక రైతులతో ఆయన మాట్లాడతారు. అనంతరం డోన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు పత్తికొండలో ఏర్పాటయ్యే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. -
కొత్తా కొలువులండి
సీఆర్డీఏలో నేరుగా నియామకాలు ఖరారు చేసిన ప్రభుత్వం రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విజయవాడ బ్యూరో : సీఆర్డీఏ ఉద్యోగుల నియామక విధానం ఖరారైంది. మంజూరైన పోస్టులను నేరుగా భర్తీ చేసుకునేందుకు సీఆర్డీఏకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏకు 778 పోస్టుల్ని మంజూరు చేసిన ప్రభుత్వం తొలి దశలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 128 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పైన, సుమారు 250 మందిని నేరుగా నియమించుకునే అవకాశం ఇచ్చింది. నేరుగా జరిపే నియామకా లు ఎలా ఉండాలనేదానిపై విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పావ్), జేఎన్టీయూకే ప్రొఫెసర్లతో చర్చలు జరిపి ప్రతిపాదనలను సీఆర్డీఏ ప్రభుత్వానికి పంపింది. వాటిని ప్రభుత్వం ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. నియామక పద్ధతి ఇలా.. డిప్లమో, డిగ్రీ అర్హతల ద్వారా భర్తీ చేసే పోస్టులను విభజించి విభాగాలవారీగా రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, సబ్జెక్టు ప్రశ్నలు కలిసి గాని విడిగా గాని ఉంటాయి. రాతపరీక్ష ఫలితాల ఆధారంగా ప్రతి పోస్టుకు సంబంధించి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. మెరిట్ లిస్ట్ రూపకల్పనలో అభ్యర్థి అర్హత, రిజర్వేషన్ కేటగిరీ, స్థానికత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో చోటు సంపాదించిన వారికి పోస్టులవారీగా ఓరల్ పరీక్ష నిర్వహిస్తారు. అది ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్స్, రెండు కలిపి గానీ ఉంటాయి. ఓరల్ పరీక్షను వీడియోలో రికార్డు చేస్తారు. రాత పరీక్షకు 80 శాతం, ఓరల్ పరీక్షకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిక్రూటింగ్ ఏజెన్సీగా ‘స్పావ్’ ఈ మార్గదర్శకాల ప్రకారం నియామకాలు జరిపేందుకు సీఆర్డీఏ కమిషనర్ విజయవాడ స్పావ్ను ప్రతిపాదించగా ప్రభుత్వం అనుమతిచ్చింది. సివిల్ ఇంజినీరింగ్, ప్లానింగ్ తదితర విభాగాల్లో నిష్ణాతులైన చెన్నయ్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లను కూడా కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకుని నియామక ప్రక్రియ జరపనున్నారు. నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సీఆర్డీఏ త్వరలో విడుదల చేయనుంది.