Residential Degree College
-
మహిళా రెసిడెన్షియల్ కాలేజీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: మహిళల కోసం ప్రారంభించనున్న రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ దరఖాస్తులను ఆహ్వానించింది. వచ్చే విద్యాసంవత్సరం (2017–18)లో బీఏ/బీకాం/బీఎస్సీ కోర్సు ల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ వెల్లడించింది. మరిన్ని వివరాలను సంస్థ వెబ్సైట్ www. tswreis. telangana. gov. in ద్వారా తెలుసుకోవచ్చునని ఎస్సీ గురుకులాల కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దరఖాస్తుకు ఆఖరు తేదీగా మార్చి 26ను ఖరారు చేశారు. -
త్వరలో జిల్లాకో గురుకుల డిగ్రీ కళాశాల
-గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిచ్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రతి జిల్లాకు ఒక సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గురుకుల పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గురుకుల కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు పేదరికంతో ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారని, ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పారు.