3 కోట్ల భూకుంభకోణం: రెవెన్యూ అధికారి అరెస్టు
పెదకాకాని భూ కుంభకోణం కేసులో రెవెన్యూ అధికారి చంద్రశేఖరరాజును పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పెదకాకాని తహసీల్దారుగా పనిచేసిన చంద్రశేఖరరాజును అక్కడి పోలీసులే అరెస్టు చేశారు. ఇక్కడ తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం ప్రకాశం జిల్లా కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న చంద్రశేఖరరాజును ఈ ఆక్రమణల కేసులోనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆక్రమణలపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. దాదాపు మూడుకోట్ల రూపాయల విలువైన అసైన్మెంట్ భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేసి, వాటిని కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.